For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరో విశాల్ మీద నటి సంచలన ఆరోపణలు.. అందుకే మీ నుంచి హీరోయిన్లు పారిపోతున్నారంటూ!

  |

  నటుడు విశాల్ అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడులో జరిగిన ఒక సంఘటన గురించి ఆయన సోషల్ మీడియా వేదిక స్పందించిన కారణంగా ఆయన ఇప్పుడు అనేక విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన గురించి ఒక నటి, రాజకీయ నాయకురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  లైంగిక వేధింపుల కలకలం

  లైంగిక వేధింపుల కలకలం

  చెన్నైలోని పద్మా శేషాద్రి బాల భవన్ అనే స్కూల్ లో పనిచేస్తున్న ఒక టీచర్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడనే విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశం మీద తమిళనాడు వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సెలబ్రిటీలు సైతం ఈ అంశం మీద స్పందిస్తూ సదరు టీచర్ ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హీరో విశాల్ కూడా ఈ అంశం మీద స్పందించారు.

  భయమేస్తోంది

  ఈ మేరకు విశాల్ స్పందిస్తూ చెన్నైలోని పద్మా శేషాద్రి బాలా భవన్ స్కూల్ ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు విన్నాక భయమేసిందని పేర్కొన్నాడు. ఆయనను అరెస్టు చేయడమే కాక స్కూల్ మూసివేసినా తప్పులేదని పేర్కొన్న విశాల్ ఇప్పటికీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పాఠశాల తరపు నుంచి ఎలాంటి క్షమాపణ చెప్పలేదు అని పేర్కొన్నారు. ఇలాంటి నేరాలకు మళ్లీ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నా స్నేహితుడు మహేష్ ను కోరుతున్నా అని అంటూ ఆయన పేర్కొన్నారు.

  ముందు ఆ వేధింపుల సంగతి చూడండి

  విశాల్ ఈ మేరకు ట్వీట్ చేయడంతో ఆయన మీద బీజేపీ నాయకురాలు, బిగ్ బాస్ సీజన్ 2లో ఎంటర్ అయి వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న గాయత్రి రఘురాం సంచలన వ్యాఖ్యలు చేసింది. చిత్ర పరిశ్రమలో ఉన్న విశాల్ ముందు అక్కడ ఉన్న లైంగిక వేధింపులను ఖండించాలని ఆమె పేర్కొంది. అప్పుడే కొత్తగా సినిమాల్లో నటించాలని వస్తున్న వారికి జరుగుతుంది ఏమిటో తెలుసుకోవాలని పేర్కొన్న ఆమె ముందు హీరోయిన్లకు ఎదురవుతున్న వేధింపుల గురించి చూడండని పేర్కొంది. మీరు మీ స్నేహితులు నటీమణులను వాడుకొని వదిలేసి ఈ స్థాయికి వచ్చారు అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

  అక్కడ వీరత్వం చూపండి

  అక్కడ వీరత్వం చూపండి

  చాలా మంది మహిళలు వల్ల ఇబ్బందులు పడ్డారని పేర్కొన్న ఆమె చిత్ర పరిశ్రమలో ఉన్న మహిళలకు మీ సహాయం అవసరం అయినప్పుడు మీరు మీ వీరత్వాన్ని చూపించాలని అన్నారు. అలాగే హిందువులు క్రైస్తవులు దెబ్బకు భయపడుతున్నారు అనే విషయం మీకు తెలుసా అని ప్రశ్నించిన ఆమె, మీరు ఎక్కువగా అప్రోచ్ అవుతారన్న కారణంగా మిమ్మల్ని చూసి హీరోయిన్లు పారిపోతున్నారు అనే విషయం తెలుసుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  Kobbari Matta Movie Pre-Release Event | Kobbari Matta | Sampoornesh Babu || Filmibeat Telugu
  మీ కామెంట్స్ సరికాదు

  మీ కామెంట్స్ సరికాదు

  అయితే చాలామంది విశాల్ కు మద్దతుగా గాయత్రి రఘురాం మీద మీద కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి విషయంలో విశాల్ స్పందించినప్పుడు అభినందించాల్సిందే పోయి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాక విశాల్ అడిగిన దాన్లో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు.

  English summary
  Actor and choreographer Gayathri Raghuram made sensational comments on vishal that many women have been victimized sexually by actor.She had recently lodged a sexual complaint against actor vishal on her twitter page.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X