తమిళనాడులో విజయ్ దేవరకొండ క్రేజ్ చూసి అంతా షాక్!
'గీత గోవిందం' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... మన పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడులోనూ భారీ రెస్పాన్స్ వస్తోంది. హీరోయిన్ రష్మిక మందన్న సొంత రాష్టమైన కర్నాటకలో అయితే ఆమె తల్లిదండ్రులు సినిమా చూడటానికి కూడా టిక్కెట్లు దొరకలేదట.
ఇక తమిళనాడు విషయానికొస్తే.... అసలు ఎవరూ ఊహించని విధంగా విజయ్ దేవరకొండ చిత్రానికి భారీ అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. ఇక సినిమా విడుదలైన తొలి రోజు ఏకంగా రూ 1.30 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ పండితులను ఆశ్చర్య పరిచింది.

తెలుగు సినిమాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో 'గీత గొవిందం' ఒకటిగా నిలిచిందని నిర్మాత ఎస్‌కెఎన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ శక్తివేలన్‌తో కలిసి దిగిన ఫోటోను ఆయన పోస్టు చేశారు.
విజయ్ దేరకొండ త్వరలో 'నోటా' అనే చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 'గీత గోవిందం' హిట్ ఎఫెక్ట్ 'నోటా'పై మరింత స్ట్రాంగ్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. విజయ్‌కు కార్తి, సూర్య లాంటి స్టార్స్ సపోర్ట్ కూడా ఉండటం కలిసొచ్చే అంశం.


Click it and Unblock the Notifications











