జెనీలియా అవార్డుకోసం సౌందర్య పాత్ర పోషిస్తోందా...!
పన్నెండేళ్ళ క్రితం నాగార్జున నటించిన ఆజాద్ సినిమా గుర్తుందా.. అందులో జర్నలిస్ట్ గా సౌందర్య చేశారు. ఆ సినిమాలో ఆమె పాత్రకు ఆమె డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ఆమె అభినయానికి మంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు ఆ విశయం ఎందుకు అనుకుంటున్నారా...? విషయం ఏమిటంటే ఇప్పుడా సినిమా తమిళంలో 'వేలాయుధం" పేరుతో తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటిస్తున్నారు.
ఇక ఆజాద్ లో సౌందర్య చేసిన పాత్రను ఇప్పుడు తమిళంలో జెనిలియా చేస్తున్నారు. అంతేకాదు సౌందర్య బాటలోనే ఆమె పాత్రకు ఆమె డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు జెనీలియా. దీని గురించే చెబుతూ, 'ఈ పాత్ర నాకు చాలా పేరు తెస్తుందనుకుంటున్నాను. అవార్డు వచ్చే అవకాశం కూడా వుంది. అందుకే, డబ్బింగ్ కూడా నేనే చెప్పుకుంటున్నాను" అంటోంది జెన్నీ. అయితే ఆ చిత్రంలో సౌందర్య స్ధానాన్ని జెన్ని భర్తీ చేయగాలుగుతుందా... లేదా... అనేది వెయిట్ అండ్ సీ.


Click it and Unblock the Notifications











