నాగార్జున 'అజాద్' రీమేక్ లో హన్సిక, జెనీలియా?
తిరుపతి స్వామి దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన అజాద్ గుర్తుండే ఉంటుంది. సౌందర్య,శిల్పాశెట్టి హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రం ప్రస్తుతం తమిళంలోకి వేలాయుధం పేరుతో రీమేక్ అవుతోంది. అలాగే సౌందర్య చేసిన జర్నలిస్టు పాత్రకు గానూ జెనీలియాని ఎంపికచేయగా,శిల్పాశెట్టి చేసిన పల్లెటూరు అమ్మాయి పాత్రకు హన్సికను ఎన్నుకున్నారు. ఈ మేరకు చెన్నైలో ఫోటో షూట్ జరిగింది. జయం రాజా దర్శకత్వం వహించే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుందని తెలుస్తోంది. ఇక హన్సిక..బాలకృష్ణ సరసన పరమవీర చక్ర చిత్రంలో బుక్కవగా, జెనీలియా...రామ్ చరణ్ సరసన ఆరెంజ్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.
నాగార్జున జెనీలియా శిల్పా శెట్టి హన్సిక అజాద్ సౌందర్య విజయ్ nagarjuna azad soundarya genelia hansika


Click it and Unblock the Notifications