ఒకే సినిమాలో జెనీలియా, కాజల్, కలర్స్ స్వాతి
ముద్దుగుమ్మలు జెనీలియా, కాజల్, కలర్స్ స్వాతి కలిసి 'వేలాయుధం" అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఇళయదళపతి విజయ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జయం రవి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హరీస్ జైరాజ్ సంగీత దర్శకుడు. జూన్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇక జెనీలియా, కాజల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, ప్రాధాన్యత ఉన్న చెల్లెలు పాత్రలో కలర్స్ స్వాతి కనిపించనుంది. ఇప్పటివరకు కలిసి నటించని ఈ ముగ్గురు నటిస్తున్న 'వేలాయుధం" తెలుగులోనూ విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఇక జెనీలియా ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ఆరెంజ్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే కాజల్...రామ్ చరణ్ సరసన మెరుపు చిత్రంలో బుక్కయింది.
More from Filmibeat
జెనీలియా కాజల్ కలర్స్ స్వాతి విజయ్ బొమ్మరిల్లు అష్టాచెమ్మ genelia kajal colors swathi vijay velayutham bommarillu


Click it and Unblock the Notifications











