జెనీలియాని వదలలేకపోతున్న 'బొమ్మరిల్లు' భాస్కర్
'బొమ్మరిల్లు' చిత్రంలో జెనిలియాను హాసిని గా చూపి హిట్టిచ్చిన దర్శకుడు భాస్కర్ ఆమెను తన తాజా చిత్రం 'ఆరెంజ్' లో ఆఫరిచ్చారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ లో ఉండగానే ఆయన..కార్తీ హీరోగా ఓ చిత్రం ఓకే చేయించుకున్నారు. అయితే ఆ చిత్రంలోనూ హీరోయిన్ గా జెనీలియానే ఆయన ప్రిఫర్ చేస్తున్నట్లు సమాచారం. తమిళ, తెలుగు భాషల్లో రూపొందే ఈ చిత్రంలో ఆఫర్ రావటంతో జెనీలియా ఎగిరి గంతేస్తోందని వినికిడి. ఛత్రపతి ఫేమ్ బి.వి.యస్.యన్ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక భాస్కర్ ప్రస్తుతం రామ్ చరణ్ చిత్రం షూటింగ్ నిమిత్తం మలేషియాలో ఉన్నారు.
రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ జెనీలియా బొమ్మరిల్లు దేవిశ్రీ ప్రసాద్ bommarillu orange genelia bhaskar devisri prasad


Click it and Unblock the Notifications