జెనీలియా గురించి చెప్పిందే నిజమే...
చెన్నై : జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పటంలో తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని యువనటుడు జయం రవి అన్నారు. తనతో జంటగా నటించిన వారిలో జెనీలియా అహం లేని నటి అని వ్యాఖ్యానించిన ఆయన.. వాటిని సమర్థించుకున్నారు.
జయం రవి మాట్లాడుతూ ''నాతో నటించినవారిలో నచ్చిన హీరోయిన్ జెనీలియా. ఈ విషయం చెప్పడానికి నాకు ఇబ్బందిగానీ, ఇతర హీరోయిన్స్ ఏమైనా అనుకుంటారనే భావనగానీ లేదు. ఆమె చాలా స్నేహంగా మెలుగుతారు. ముఖ్యంగా స్వార్థం, అహంభావం లేని హీరోయిన్. ఆమెతో నటించటం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మిగతా విషయాలకొస్తే.. అన్నయ్య జయంరాజా దర్శకత్వంలో 'ఎమ్.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి', 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' చిత్రాల్లో నటించాను.

నిజానికి ఈ రెండు చిత్రాల్లో నయనతారతో జంటగా నటించే ప్రయత్నాలు జరిగాయి. అవి సఫలం కాలేదు. ఆమెతో కలిసి నటించే అవకాశం ఇన్నాళ్లకు వచ్చింది. అన్నయ్య దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమిళం వచ్చిన నటి కావటంతో పాత్ర పరిధిని బాగా అర్థం చేసుకుంటూ నటిస్తోంది. నయనతార ఓ ప్రతిభావంతురాలు' అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











