twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేపే జెనీలియా ర్యాంప్ వాక్ షో

    By Srikanya
    |

    చెన్నై ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ (CIFW)లో జెనీలియా రేపు బుదవరాం(డిసెంబర్ 16)ర్యాంప్ వాక్ చెయ్యనుంది. పది దేశాలనుంచి ముప్పై మంది పాపులర్ డిజైనర్స్ వచ్చి తమ క్రియేషన్స్ ని ప్రముఖ మోడల్స్‌తో ధరింపజేసి ఈ ర్యాంప్‌పై ప్రదర్శించనున్నారు. వారిలో ఇషితా సింగ్‌ అనే ప్రముఖ డిజైనర్‌ తన డిజైన్స్‌ని ప్రదర్శించడానికి మంచి హీరోయిన్ అయితే బాగుంటుందనుకున్నారు. దాంతో ఈ అవకాశం జెనీలియాని వరించింది. ఆమె జెనీలియాని ఫిక్స్‌ అయ్యి అడగగానే...వెంటనే ఓకే చేసేసింది. ఇక జెనీలియా శరీరాకృతికి నప్పే డిజైనర్‌ దుస్తులను తయారు చేశారు ఇషితా. బుధవారం నాడు ఆ డిజైనర్‌ దుస్తుల్లో ర్యాంప్‌వాక్‌ చేయడానికి జెనీలియా సన్నాహాలు చేస్తున్నారు.

    ఇక జెనీలియా లేటెస్ట్ రిలీజ్ 'కథ' చిత్రం ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ రొమాంటిక్ ధ్రిల్లర్ ఊహించినంత గొప్పగా లేదని, సినిమా టీవీ సీరియల్ లాగ సాగుతూ బోర్ కు గురి చేసిందని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అయితే స్కూల్ టీచర్ గా చేసిన జెనీలియా పాత్రకు మాత్రం ఏ వంకా పెట్టలేమంటూ ఆమెకు మంచి మార్కులే వేస్తున్నారు. అలాగే జెనీలియా రామ్ చరణ్ తేజ సరసన బొమ్మరిల్లు భాస్కర్ చిత్రానికి కమిట్ అయింది. వీటితో పాటు ఆమె నటించిన హిందీ చిత్రం 'చాన్స్‌ పే డాన్స్‌' 2010 జనవరిలో విడుదల కానుంది. షాహిద్‌కపూర్‌, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలు కాకుండా జెనీలియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'బిగ్‌ స్విచ్‌' అనే టీవీ షోకి మంచి స్పందన లభిస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X