జెనీలియాకు డబుల్ ధమాకా ఆఫర్స్..
జెనీలియా భలే లక్కీ ఫెలో అంటున్నారు అంతా. ఆమె బొమ్మరిల్లు చిత్రంలో చేసిన హాసిని పాత్ర తర్వాత హిందీ,తమిళ బొమ్మరిల్లు చిత్రాల్లో చేసింది.అలాగే ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతున్న రెడీ చిత్రంలోనూ ఆమెనే తీసుకున్నారు. అలా ఒకే పాత్ర రెండు సార్లు,మూడు సార్లు చేయటం ఆమె అదృష్టమంటోంది. అయితే దర్శకులు మాత్రం ఆమెను తప్ప ఆ రీమేక్ లలో వేరే వారిని ఊహించుకోలేకే ఈ నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఇక తమిళంలో రూపొందనున్న రెడీ చిత్రం టైటిల్ పూజ. పూజ అని ఎందుకు పెట్టారంటే ఆ చిత్రంలో జెనీలియా పాత్ర పేరు. ఆమె చుట్టూ తిరిగే కథ కాబట్టి ఆ పేరునే టైటిల్ గా పెట్టామంటున్నారు.ధనుష్ హీరోగా రూపొందే ఈ చిత్రాన్ని జవహర్ మిత్రన్ దర్శకత్వం వహిస్తారు.దాంతో జెనీలియా కొత్తగా సినిమాలు వెతుక్కోవాల్సిన పనిలేదు. ఒకటి ఒప్పుకుంటే..ఆ రీమేక్ లు ఆమెకు డబుల్ ధమాకా లా వస్తాయంటున్నారు. అదీ మ్యాటర్.


Click it and Unblock the Notifications











