నన్ను అలా మోసగించాడు.. హీరో ఆర్యపై ప్రధానికి జర్మనీ మహిళ ఫిర్యాదు
తమిళ హీరో ఆర్యపై జర్మనీకి చెందిన మహిళ ఫిర్యాదు చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏకంగా ప్రధాని నరేంద్రమోదీకి, తమిళనాడు ప్రభుత్వానికి ఈమెయిల్ ద్వారా తన ఫిర్యాదును చేశారు. అయితే తనపై వచ్చిన ఫిర్యాదుపై హీరో ఆర్య నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఆ ఫిర్యాదు వివరాల్లోకి వెళితే..

నా నుంచి 70 లక్షలు తీసుకొని
జర్మనీలో స్థిరపడిన శ్రీలంక పౌరురాలు విట్జా తెలిపిన ప్రకారం.. నన్ను పెళ్లి చేసుకొంటానని మాటలు చెప్పి నమ్మించాడు. కరోనా సమయంలో నాకు సినిమా ఆఫర్లు లేవు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానంటూ నా వద్ద నుంచి రూ.70 లక్షల 40 వేలు తీసుకొన్నాడు. అప్పటి నుంచి నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు అంటూ జర్మనీకి చెందిన విట్జా తన ఫిర్యాదులో తెలిపారు.

ఫోన్‌లో నన్ను దుర్భాషలాడి
ఆర్యను ఎలాగోలా ఇటీవల ఫోన్ ద్వారా మాట్లాడాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు. అలాగే నా నుంచి తీసుకొన్న డబ్బు కూడా ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. అదికాకుండా నన్ను ఫోన్‌లో చెప్పడానికి వీలు లేని విధంగా దుర్బాషలాడారు అంటూ విట్జా తెలిపారు.

నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ
నన్నే కాకుండా ఇంకా చాలా మందిని ఇలా మోసగించాడనే విషయం ఇటీవల నాకు తెలిసింది. నాతో జరిపిన ఆన్‌లైన్ చాటింగ్, ఆయనకు నేను ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బుల వివరాలు, వాటికి సంబంధించిన సాక్ష్యాలు నా వద్ద ఉన్నాయి అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నెటిజన్ల ట్రోలింగ్‌తో
అయితే ఆర్యపై విట్జా చేసిన ఫిర్యాదును నెటిజన్లు తప్పుపట్టారు. 2019లో హీరోయిన్ సాయేషాను ఆర్య పెళ్లి చేసుకొన్న విషయాన్ని ప్రస్తావించారు. అలాగే కోవిడ్ సమయంలో ఆయన సర్పట్టా పరంబరై, ఎనిమీ చిత్రాల్లో నటించేందుకు అంగీకరించారనే విషయాన్ని నెటిజన్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











