రజనీకాంత్ క్రేజ్: ‘కాలా’ స్పెషల్ ఈమోజీ విడుదల చేసిన ట్విట్టర్

By Bojja Kumar

రజనీకాంత్ అంటే దేశ వ్యాప్తంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో, ఆయన సినిమా విడుదలైతే క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో త్వరలో రాబోతున్న 'కాలా' సినిమాపై ఉన్న డిమాండ్‌ను వాడుకునేందుకు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సిద్ధమైంది. ఈ మేరకు 'కాలా' స్పెషల్ ఈమోజీలు విడుదల చేసింది. 'కాలా' యాష్ ట్యాగ్‌తో ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ ఇలా ఏ భాషలో అయినా ట్విట్టర్లో టైప్ చేసినా పక్కన కాలా స్పెషల్ ఈమోజీ దర్శనమిస్తుంది.

జూన్ 7న 'కాలా' మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు ఇంకా 10 రోజులు మాత్రమే ఉండటంతో రజనీ అభిమానులకు 'కాలా' పీవర్ పట్టుకుంది. తమిళంతో పాటు హిందీ, తెలుగు, మలయాళంలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యూఎస్ఏలో కనీసం 300 లొకేషన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు రజనీ అభిమానులు భారీగా ఉండే మలేషియా, సింగపూర్, జపాన్, గల్ఫ్ దేశాల్లో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.

రజనీకాంత్‌తో పాటు ప్రముఖ హిందీ నటుడు నానా పాటేకర్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ముంబై మురికివాడ ధారావి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ధారావి డాన్ పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నారు. నానా పాటేకర్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటి హుమా ఖురేషి కూడా నటిస్తోంది. కబాలి తర్వాత దర్శకుడు పా రంజిత్‌తో రజనీకాంత్ చేస్తున్న రెండవ సినిమా ఇది. తొలి మూవీ సంచలన విజయం సాధించడంతో ఈచిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

Get ready to celebrate Kaala with a custom emoji on Twitter

వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో విడుదల చేయబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X