అదా అనూష్క మాస్టర్ ప్లాన్?
తమిళంలో ఇప్పుడు ఎక్కడ విన్నా అనూష్క భజన వినపడుతోంది. అయితే ఆమె అక్కడ డైరక్ట్ గా చేసింది రెండు అనే సినిమా మాత్రమే. అదీ అంతంత మాత్రమే ఆడింది. అలాగే ఆ తర్వాత చాలా కాలానికి అరుంధతి డబ్బిగ్ వెర్షన్ రిలీజై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. మరి ఇలాంటి పెద్దగా హిట్లు, సినిమాలు లేని అనూష్క గురించి మీడియా ఎందుకంత ప్రాధాన్యత ఇస్తోందని చాలా మందికి సందేహం వచ్చింది. దాంతో కొందరు ఉత్సాహవంతులు ఈ విషయమై ఎంక్వైరీ చేస్తే కొన్ని షాకింగ్ నిజాలు బయిటపడ్డాయి.
అనూష్క తన కోసం ప్రత్యేకంగా తమిళనాడులో ఓ పీ.ఆర్.వో ని పెట్టుకుంది. అతను మీడియా వారికి ప్రత్యేకమైన ఆఫర్ ఇచ్చాడని తేలింది. అనూష్క గురించి ఏ రకమైన న్యూస్, గ్యాసిప్ రాసినా వారిని కలిసి ఓ ఖరీదైన గిప్ట్ అందచేస్తున్నాడు. అలాగే ఛానెల్స్ లో కూడా అనూష్క ఇంటర్వూలు, ఆమె సినిమాల క్లిప్స్ తో పోగ్రాములు వచ్చేలా ఏర్పాటు చేసాడు. అయితే ఈ ప్లాన్ వెనుక అనూష్క మైండ్ ఉందని సమాచారం. పైకి పబ్లిసిటీ వద్దు మీడియాకు దూరం అనే ఆమే ఈ మాస్టర్ ప్లాన్ వేసి తమిళనాడులో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోంది. అందుకు ప్రతిఫలంగా ఆమె తమిళ టాప్ హీరో విజయ్ ప్రక్కన ఛాన్స్ కొట్టేసిందని చెప్పుకుంటున్నారు. ఇది చూసి కంగారుపడ్డ మిగతా హీరోయిన్స్ కూడా తమ పీఆర్వోలపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











