గెస్ట్ రోల్ చేయడానికి గజినీ సూర్య నో అబ్జెక్షన్...
మురుగదాస్ రూపొందించిన గజిని సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నటుడు సూర్య. ఈ మధ్య సక్సెలు లేని సూర్య 'యముడు"తో సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్ లో రెడ్ జైంట్ పిక్చర్స్ బ్యానర్ పై ఉదయనిథి స్టాలిన్ నిర్మిస్తున్న 'సెవెన్త్ సెన్స్" అనే చిత్రంలో నటిస్తున్న సూర్య ఇకపై అతిథిగా కూడా కనిపించబోతున్నాడు..శివపుత్రుడు సినిమాతో సూర్యకి నటుడిగా గుర్తింపు తీసుకొచ్చిన బాల ప్రస్తుతం విశాల్, బాల హీరోలుగా 'అవన్ ఇవన్" అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్య ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంతో పాటు కమల్ హాసన్ నటిస్తున్న 'మన్మధబాణం" చిత్రంలోనూ..సూర్య ఓ ప్రత్యేకమైన సాంగ్ లో కనిపించబోతున్నాడు. ఈ సాంగ్ లో 'ఆరెంజ్" గళ్ జెనీలియా కూడా కనిపించనుంది.


Click it and Unblock the Notifications











