సీనియర్ నటి రమ్యకృష్ణ పెళ్ళైనా కొద్దిగా కూడా గ్లామర్ తగ్గలేదని ఈ మధ్య ఓ సంఘటన రుజువు చేసింది. ఇటీవల చెన్నైలో ఆమె చేసిన ఫ్యాషన్ ర్యాంప్ వాక్ కేక పుట్టించిందని సమాచారం. ఇక ఈ ర్యాంప్ వాక్‌లో శ్రియ, రాధిక, త్రిష మరికొందరు తమిళ హీరోయిన్లు కూడా పాల్గొన్నారు. అయితే అందరికన్నా ఎక్కువ ఓట్లు, క్లాఫ్స్ రమ్యకృష్ణ కే పడ్డాయ. దాదాపు 40 కి దగ్గరైన రమ్యకృష్ణ ఓ రేంజిలో అలా అందాలు విరజిమ్మటం ..జూనియర్స్ కే సవాల్ విసిరినట్లయిందని చెప్తున్నారు. ఇకఈ ర్యాంప్ వాక్ షోకు హాజరైన సినీ ప్రముఖులైతే అబ్బే రమ్యకృష్ణ కు తగ్గలేదు..ఎట్లా అయినా మళ్ళీ ఎంకరేజ్ చేయాలని అర్జెంటుగా డిసైడ్ చేసుకున్నట్లు సమాచారం. ఏదైమైనా పెళ్ళై..ఓ బిడ్డకు తల్లైనా ఇంకా అందరిలో గుబులు పుట్టించటం సామాన్యమైన విషయం కాదు కదా.