twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్‌ను వెంటాడుతున్న ఉత్తమ విలన్.. అప్పు చెల్లించలేదని నిర్మాత కేసు

    |

    విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు తమిళనాడు సినీ పరిశ్రమలో ఎదురు దెబ్బ తగిలింది. తనకు తిరిగి చెల్లించాల్సిన సొమ్మును ఇవ్వడం లేదని ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా తమిళనాడు సినీ నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. గత కొద్దికాలంగా తనకు డబ్బు తిరిగి ఇవ్వాలని చేసిన విజప్తికి కమల్ స్పందించకపోవడంతో జ్ఞానవేల్ రాజా తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో కమల్, జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం మరింత ముదిరింది.

    ఉత్తమ విలన్ సినిమా సమయంలో

    ఉత్తమ విలన్ సినిమా సమయంలో

    నిర్మాత జ్ఞానవేల్ రాజా, నటుడు కమల్ హాసన్‌కు మధ్య తలెత్తిన వివాదానికి ఉత్తమ విలన్ మూవీ కీలకంగా మారింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో రూ.10 కోట్లు తీసుకొన్నట్టు జ్ఞానవేల్ రాజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పలు మార్లు తిరిగి ఇవ్వాలని చేసిన సూచనను పెడచెవిన పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు.

    ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో

    ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో

    2015లో ఉత్తమ విలన్ అనే చిత్రంలో కమల్ హాసన్ నటించాడు. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి రిలీజ్‌కు సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే జ్ఞానవేల్ రాజా నుంచి అప్పుగా రూ.10 కోట్లు తీసుకొన్నారు. అప్పటి నుంచి డబ్బు వెనుకకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే విషయాన్ని తన ఫిర్యాదులో కూడా జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు.

    సినిమా డేట్స్ ఇస్తానని చెప్పి

    సినిమా డేట్స్ ఇస్తానని చెప్పి

    జ్ఞానవేల్ రాజా నుంచి అప్పుగా తీసుకొనే సమయంలో కమల్ హాసన్ హామీ ఇచ్చారు. తాను రూపొందించే సినిమాలో ఆయన నటిస్తానని చెప్పారు. ఆ క్రమంలో తన రెమ్యునరేషన్‌లో రూ.10 కోట్ల తగ్గించుకొంటానని చెప్పారు. సినిమా రిలీజై నాలుగు సంవత్సరాలు గడిచినా కమల్ హాసన్ డేట్స్ ఇవ్వలేదు.. డబ్బు తిరిగి ఇవ్వలేదు అని జ్ఞానవేల్ రాజా మీడియాకు వివరించారు.

    అందుకే కేసు పెట్టాను

    అందుకే కేసు పెట్టాను

    తనతో సినిమా చేయడానికి కమల్ హాసన్ ఉత్సాహం చూపించడం లేదు. అందుకోసమే నేను నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని జ్ఞానవేల్ రాజా తెలిపారు. కమల్ హాసన్‌పై జ్ఞానవేల్ రాజా చేసిన ఫిర్యాదును తమిళ నిర్మాతల సంఘం ధ్రువీకరించింది. ఇక కమల్ హాసన్ విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు.

    English summary
    Producer Gnanavel Raja files case on Versatile actor Kamal Haasan in TFPC. Kamal failed pay Rs.10 crores, which borrowed from the producer. In this connection, He Filed a petition at TFPC
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X