శివ కార్తికేయన్ కు నిర్మాత రివర్స్ షాక్.. పెనాల్టీ కట్టించమని కోర్టుకు!
వరుస సినిమాలతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ హీరో శివకార్తికేయన్ ఇప్పుడు తెలుగు వారికి కూడా దగ్గరయ్యారు. తెలుగు-తమిళ బై లింగ్యువల్ సినిమా చేస్తున్న ఆయన మీద ఒక నిర్మాత పిటిషన్ దాఖలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

జ్ఞానవేల్ రాజాపై
2019లో శివకార్తికేయన్ హీరోగా నటించిన "మిస్టర్ లోకల్" అనే సినిమా రిలీజై భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో నటించడానికి హీరోకు రూ.15 కోట్లు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. సినిమా విడుదలై ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకూ పూర్తి రెమ్యూనరేషన్ ను చెల్లించలేదని అభియోగం. అందుకే ఇప్పుడు "మిస్టర్ లోకల్" సినిమాను నిర్మించిన నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాపై శివకార్తికేయన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్ దాఖలు
ఆయన చేస్తున్న అంతేకాదు రెబల్, చియాన్ 61, పాతు తాలా పేరుతో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లలో నిర్మాత జ్ఞానవేల్ రాజా పెట్టుబడులు పెట్టకుండా నిరోధించాలని, ఈ మూడు సినిమాలకు సంబంధించిన థియేట్రికల్ రిలీజ్ లేదా ఆయా సినిమాలకు సంబంధించిన ఎలాంటి హక్కులు అమ్మకుండా నిషేధించాలని శివకార్తికేయన్ కోర్టును కోరారు. తన సినిమాకు 15 కోట్లు పారితోషికం ఇస్తామని జూలై 6, 2018 న ఒప్పందం చేసుకుని, రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించారని పిటిషన్ దాఖలు చేశాడు.

టిడిఎస్ కట్టలేదని
అంతే కాదు ఇచ్చిన రూ. 11 కోట్లకు కూడా టీడీఎస్ కట్టలేదని, రూ. 91 లక్షలు టీడీఎస్ కింద కట్ అయ్యాయని కార్తికేయన్ పేర్కొన్నాడు. నిర్మాత ఆ 11 కోట్లకి టిడిఎస్ కట్టారనుకుని శివ కార్తికేయన్ టాక్స్ చెల్లించక పోయేసరికి.. పన్ను ఎగవేత చేసినట్లు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి దేశివ కార్తికేయన్ కి నోటీసులు రావడంతో అప్పుడు అన్ని చూసుకున్న ఆయన నిర్మాత టిడిఎస్ కట్టలేదని తెలుసుకున్నారని అంటున్నారు.

కథ అసలు నచ్చలేదని
అయితే ఆయన మీద కేసు వేసిన తమిళ హీరో శివకార్తికేయన్‌కు ఇప్పుడు కెఇ. జ్ఞానవేల్ రాజా షాక్ ఇచ్చారు. శివ కార్తికేయన్ వేసిన పిటిషన్ విచారణలో శివ కార్తికేయన్ వల్ల తాను రూ. 20 కోట్లు నష్టపోయినట్లు తెలుపుతూ పిటిషన్ దాఖలు చేశారు జ్ఞానవేల్ రాజా. తనకు మిస్టర్ లోకల్ కథ అసలు నచ్చలేదని, చెప్పినా వినకుండా తనతో బలవంతంగా సినిమా చేసేలా ఒత్తిడి తీసుకొచ్చాడని జ్ఞానవేల్ రాజా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అందుకే ఈ సినిమాను నిర్మించినానని పటిషన్‌లో పేర్కొన్నాడు.
Recommended Video


తమిళ, తెలుగు భాషల్లో
సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా అప్పుడే తనపై కేసు ఎందుకు పెట్టారు అని ప్రశ్నించాడు. ఇక తాను సినిమా చేసి నష్టపోయినందుకు శివకార్తికేయన్‌కు పెనాల్టీ విధించి, తనపై ఉన్న కేసును కొట్టివేయాల్సిందిగా జ్ఞానవేల్ రాజా కోరాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లల్ 'అయాలాన్' సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి రవికుమార్ దర్శకత్వం వహించారు. మరో ప్రక్క తమిళ, తెలుగు భాషల్లో జాతిరత్నాలు దర్శకుడుతో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాను సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











