GOAT మిస్సింగ్ మిస్టరీతో విజయ్ మూవీ.. ఆ లుక్ కోసమే ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాంటే?
తమిళ సూపర్‌స్టార్, ఇళయ దళపతి విజయ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఒక సినిమాకు మరో సినిమా పోలీక లేకుండా యాక్షన్, ఎమోషన్స్ అంశాలతో తన క్యారెక్టర్‌లో హీరోయిజానికి ఏ మాత్రం కొదువ లేకుండా డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను ఆలరిస్తున్నారు. అయితే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT). ఈ సినిమా కథ, బడ్జెట్, ఇతర ఆసక్తికరమైన వివరాల్లోకి వెళితే..
Recommended Video

చరిత్రలో అంతు చిక్కుకుండా మిస్సింగ్ కేసుగా మిగిలిన ఓ పైలెట్ జీవితం ఆధారంగా విజయ్ నటించే The Greatest of All Time (GOAT) మూవీ తెరకెక్కుతున్నది. 1971 సంవత్సరంలో నడుస్తున్న విమానంలో నుంచి కనుపించకుండా పోయాడు. ఇప్పటి వరకు ఆ పైలెట్ మిస్సింగ్ కేసును FBI కూడా ఛేదించలేకపోయింది.

ఇలాంటి కథతో 2019 సంవత్సరంలో జెమినీ మ్యాన్ అనే సినిమా వచ్చింది. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ఓ వ్యక్తిని క్లోన్ చేసిన కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో విల్ స్మిత్ నటించి మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొన్నది.
మిస్టరీగా మారిన పైలెట్ మిస్సింగ్ కేసు ఆధారంగా గోట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీగా బడ్జెట్ కేటాయించారు. ఈ సినిమాలో రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో విజయ్ కనిపించనున్నారు. అయితే యంగ్ లుక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక GOAT సినిమాలో యంగ్ విజయ్ పాత్ర కోసం భారీగా బడ్జెట్ కేటాయించారు. ఈ సినిమాలో విజయ్ ను యంగ్ లుక్‌లో చూపించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కేవలం లుక్ కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. తొలిసారి తమిళ సినిమా కోసం భారీగా AI టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్టు తెలుస్తున్నది.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొంతున్న గేట్ సినిమా కోసం ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. సిద్దార్థ నూని సినిమాటోగ్రఫిని, వెంకట్ రాజెన్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా కలపథి ఎస్ ఆగోరామ్ బ్యానర్‌పై రూపొందుతున్నది.


Click it and Unblock the Notifications











