'పవర్‌స్టార్'పై గూండా యాక్ట్...బ్యాంకు ఖాతాల స్తంభన
చెన్నై : పవర్‌స్టార్ డాక్టర్ శ్రీనివాసన్‌పై కేసులు రోజు రోజుకీ బిగుసుకుంటున్నాయి. ఆయనపై కేసులు నానాటికీ పెరగడంతో ఆయన్ను నమ్మి డబ్బులివ్వకూడదంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఆదివారం మరో ఫిర్యాదు రావడంతో ఆయన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. పవర్‌స్టార్ బినామీ పేర్లతో కోట్లాది రూపాయల ఆస్తి కూడబెట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఆ దిశగా కూడా విచారణ జరుపుతున్నారు. అన్నానగర్, సాలిగ్రామం బ్యాంకుల్లోని పవర్‌స్టార్ ఖాతాలను తనిఖీ చేస్తున్నారు. వేలూరు జైలులో ఉన్న శ్రీనివాసన్‌ను త్వరలో గూండాచట్టం కింద అరెస్టు చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తిరుమంగళంలోని ఆయన ఆస్పత్రి ఉద్యోగులకు జీతాలివ్వలేదనే కేసును కూడా తాజాగా నమోదు చేశారు. ఈ కేసులు నుంచి పవర్ స్టార్ బయిటకు రావటం కష్టమే అంటున్నారు.


Click it and Unblock the Notifications












