తమిళ రీమేక్ గా గోపీచంద్ ఫ్లాప్ సినిమా
గోపీచంద్ కెరీర్ లో పెద్ద ప్లాఫ్ గా నిలిచిన ఒంటరి చిత్రం ఇప్పుడు తమిళంలోకి రీమేక్ అవుతోంది. తెలుగులో డైరక్ట్ చేసిన రమణ ఈ చిత్రాన్ని తమిళంలో చేస్తున్నారు. ఒక ప్రముఖ నటి తనయుడు హీరోగా నటించనున్నారు. అలాగే తెలుగు ఒరిజనల్ లో నటించిన భావననే తమిళంలోనూ హీరోయిన్‌గా తీసుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి తమిళ రచయిత కథని ఇచ్చారు. అతనే ఈ చిత్రాన్ని తమిళంకూ మార్కెట్ చేసి పెట్టారంటున్నారు. ఇక ఇటువంటి కథలు తమిళంకే నప్పుతాయని,పొరపాటున తెలుగుకు చేసామని దర్శకుడు అభిప్రాయపడతున్నాడని చెప్తున్నారు.అలాగే ఈ చిత్రం డిఫెరెంట్ స్క్రీన్ ప్లే తో తయారవటం, క్లైమాక్స్ విషాదం కావటం, ప్రి క్లైమాక్స్ ట్విస్ట్ ను జనం యాక్సెప్ట్ చేయకపోవటంతో సినిమా ఆడలేదని, అవన్నీ తమిళంకు పట్టే ఎలిమెంట్స్ అని చెప్తున్నారు. ఇక తమిళం కోసం కథలో ఉన్న లవ్ స్టోరీలో కొన్ని మార్పులు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











