‘జిల్’ విలన్ ..నెక్స్ట్ ఓ భారీ చిత్రంలో బుక్కయ్యాడు
చెన్నై: రీసెంట్ గా విడుదలైన గోపీచంద్ చిత్రం ‘జిల్' లో విలన్ గా చేసిన కబీర్ దుహన్ సింగ్ కు ఇప్పుడు ఆఫర్స్ వరస కడుతున్నాయి. తొలి చిత్రంతోనే తనదైన ముద్ర వేసిన కబీర్ ఇప్పుడు తమిళంలో ఓ పెద్ద చిత్రంలో విలన్ గా బుక్కయ్యారు. అజిత్ హీరోగా రూపొందనున్న చిత్రం ‘Acchamillai' లో అతన్ని తీసుకున్నారు. తెలుగులో గతంలో గోపిచంద్ తో శౌర్యం తీసిన డైరక్టర్ శివ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంతో తమిళంలో మరిన్ని ఆఫర్స్ వస్తాయని కబీర్ భావిస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక హీరోలతో పాటు విలన్లకు దేహదారుఢ్యం చాలా ముఖ్యమని నటుడిగా మారిన మోడల్ కబీర్ దుహన్ సింగ్ అన్నాడు. సినిమా రంగంలో ఫిట్ గా ఉంటేనే హిట్ అవుతారని వ్యాఖ్యానించాడు. గోపీచంద్ హీరోగా నటించిన 'జిల్' సినిమాతో అతడు విలన్ గా వెండితెరకు పరిచయమయ్యాడు.

'ఫిట్ నెస్ హీరోలు ఒక్కరికే ఇంపార్టెంట్ కాదు. వెండితెరపై విలన్ పాత్రలు పోషించే వారు కూడా ఫిట్ నెస్ కు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. మనమంతా వినోద రంగంలో ఉన్నాం. స్క్రిన్ పై ఎలా కనబడతామన్నదే ఇక్కడ ప్రాధానం' అని కబీర్ అన్నాడు.
'జిల్'లో తాను చేసిన డాన్ పాత్రకు మంచి స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత వెల్లువలా అవకాశాలు వస్తున్నాయని తెలిపాడు. రవితేజ హీరోగా నటించిన 'కిక్ 2' సినిమాలోనూ విలన్ గా నటించానని చెప్పాడు.


Click it and Unblock the Notifications











