రజనీ తదుపరి సినిమాపై మరో పుకారు!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి సినిమాపై మరో పుకారు పుట్టింది. అదేంటంటే హిందీలో నిర్మాణమై ఇంకా విడుదల కాని హల్లా బోల్ సినిమా తమిళ రీమేక్ లో రజనీకాంత్ హీరోగా నటించనున్నాడనీ. హల్లాబోల్ సినిమాలో అజయ్ దేవ్ గన్, విద్యాబాలన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జెస్సికాలాల్ మర్డర్ కేసు ఆధారంగా రూపొందినట్టు సమాచారం.
సాయిమీరా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇది నిజమా అని హల్లాబోల్ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ సంతోషిని ఆడిగితే ఇప్పటివరకైతే నాకేం తెలియదు అంటాడు. అయితే రజనీకాంత్ తో ఈ విషయమై చర్చలు కొనసాగుతున్నాయని సాయిమీరా ప్రొడక్షన్స్ సంస్థ తెలిపింది. రజనీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కదా సీన్ కదిలేది.


Click it and Unblock the Notifications











