ఆ..విషయాన్ని అటకెక్కించిన త్రిష
దక్షిణాది టాప్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత త్రిష సినీ కెరీర్ లో 'మన్కథా" రూపంలో ఓ పెద్ద హిట్టొచ్చి పడింది. అయితే తెలుగు వర్షన్ గేంబ్లర్ మాత్రం సక్సెస్ కాలేదు. ఒరిజినల్ వర్షెన్ లో హిట్టునే లెక్కలోకి తీసుకుంటారు కాబట్టి త్రిష దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. మరిన్ని పెద్ద బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఇక పోతే...గ్యాంబ్లర్ చిత్రం విజయం సాధించి ఉండక పోతే త్రిష తన సినీ కెరీర్ కి వీడ్కోలు చెప్పి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అప్పట్లో భావించింది. త్రిష మదర్ ఇప్పటికే ఆమె కోసం కొన్ని సంబంధాలు చూసింది కూడా. అయితే గ్యాంబ్లర్ విజయంతో త్రిష ఆ ఆలోచన మానుకుందట. మరో రెండు మూడు సంవత్సరాల వరకు పెళ్లి విషయం జోలికి పోకూడదని నిర్ణయించుకుంది.


Click it and Unblock the Notifications











