నటి గౌతమి రీ ఎంట్రీ ఆ సినిమాతో...
దాదాపు పదిహేనేళ్ల కిందట పెద్ద తెరకు దూరమైన గౌతమి మళ్లీ రీఎంట్రి ఇవ్వబోతోంది. కొంతకాలంగా కమల్ హాసన్ తో సహజీవనం చేస్తున్న ఆమెతెలుగు, తమిళ, హిందీ భాషల్లో కమల్‌హాసన్ రూపొందిస్తున్న 'అమర్ హై' చిత్రంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమెకోసమే కమల్ హాసన్ ఓ ప్రత్యేక పాత్రని తీర్చిదిద్దినట్లు సమాచారం. తన అందచందాలతోనే కాక నటనతోనూ రాణించిన గౌతమి ఈ మధ్య కాలంలో వెండితెరకు పూర్తి స్ధాయిలో దూరమైంది. అయితే తాను నటించటానికి రెడీగా ఉన్నా పరిశ్రమనుంచి ఆఫర్స్ రావటం లేదని ఆమె వాపోతోంది.
ఇక వెండి తెరకు పూర్తిగా దూరమైన గౌతమి త్వరలో డ్రెస్ డిజైనర్ గా తన టాలెంట్ ను ప్రదర్శించబోతోంది. కమల్‌హాసన్ రూపొందిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. ఈ చిత్రానికి వస్త్రాలను గౌతమి తీర్చిదిద్దారు. గతంలో 'దశావతారం' చిత్రానికీ ఆ విభాగంలో సలహాలిచ్చారు. అయితే 'విశ్వరూపం' కోసం చేయడం ఓ సవాల్ లాంటిది అంటున్నారామె. నాలుగు ఖండాలకు చెందిన పాత్రలు కనిపిస్తాయి ఈ చిత్రంలో. వారి సంస్కృతులు, పద్ధతులకు అనుగుణంగా దుస్తుల్ని తయారు చేయించారు గౌతమి.
ఈమె మీడియాతో మాట్లాడుతూ...'విశ్వరూపం'సినిమాకి పని చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. నేను రూపొందించిన కాస్ట్యూమ్స్ నా కూతురు సుబ్బలక్ష్మికి నచ్చుతాయో లేదో అని కంగారుగా ఉండేది. నచ్చాయి'' అన్నారామె. తెరపై కూడా కనిపించడానికి గౌతమి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అలాగే ఆ మధ్యన కమల్ కూతురు ప్రముఖ నటి శృతిహాసన్ మీడియాతో మాట్లాడుతూ...మా నాన్నకి, గౌతమికి మధ్య ఉన్న బంధం పై నాకేమీ అబ్జెక్షన్ లేదు. అలాగే మేము మా జీవితాల్లోకి గౌతమి రావటాన్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. మా నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తాను అంది. ఇక కొంతకాలంగా ఆమె కమల్ హాసన్ తో సహజీవనం చేస్తోంది. వారి కాంబినేషన్లో క్షత్రియపుత్రుడు వంటి అధ్బుతమైన చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











