twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ సినిమాకి తమిళంలో 'లవ్‌స్టోరీ' టైటిల్

    By Srikanya
    |

    చెన్నై : నాగార్జున హీరోగా తెరకెక్కిన 'గ్రీకువీరుడు' ఈనెల 19న తెలుగులో విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో 'లవ్‌స్టోరీ'గా రూపుదిద్దుకుంటోంది. ఏఆర్‌కే రాజరాజా తమిళంలో మాటలు రాస్తున్నారు. గురు బ్రహ్మ ఫిల్మ్స్ వారు ఈ చిత్రం రైట్స్ ని తీసుకున్నారు.

    చిత్ర విశేషాల గురించి రాజరాజా మాట్లాడుతూ.. '' తెలుగులో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రేమ, యాక్షన్‌ కలగలసిన కుటుంబ కథా చిత్రం. ఇందులో నాగార్జున చాలా అందంగా కనిపిస్తారు. గతంలో ఆయన నటించిన పలు చిత్రాలు కోలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ కోవలో 'లవ్‌స్టోరీ' కూడా విజయాన్ని సాధిస్తుంది''అని చెప్పారు. ప్రస్తుతం తమిళ అనువాద పనులు శరవేగంగా సాగుతున్నాయి.

    ఈ చిత్రం కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ...అబ్బాయి మేడిన్‌ అమెరికా. మనసు మాత్రం పక్కా ఇండియా. పిజ్జా, శాండ్‌విచ్‌ల మధ్య పెరిగినా, మనదైన ఆవకాయ రుచినే ఇష్టపడతాడు. అయితే ప్రేమ, పెళ్లి.. ఈ తతంగాలపై నమ్మకం మాత్రం లేదు. ఎంతమందినైనా ప్రేమించొచ్చు అనేది అతని ఫిలాసఫీ! చూడ్డానికి గ్రీకు వీరుడిలా ఉంటాడు కాబట్టి.. అమ్మాయిలూ అతని ప్రేమలో పడిపోతారు. ఈ అమెరికా అబ్బాయి అభిప్రాయాలకు విరుద్ధభావాలున్న ఓ అమ్మాయి తారసపడింది. అప్పుడు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో మా సినిమా చూసి తెలుసుకోండి అన్నారు

    అలాగే..అమెరికాలోనే పుట్టి పెరిగిన హీరో ఎన్‌ఆర్‌ఐగా మొట్టమొదటిగా భారతదేశానికి వస్తాడు. అతను పొందిన కొన్ని అనుభవాలతో ఈ కథ రూపొందించాం. 'సంతోషం' తర్వాత నాగార్జునతో మళ్లీ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 'గ్రీకువీరుడు'లో నాగార్జున కొత్తగా కనిపిస్తారు. అలాగే కథ కూడా ఆసక్తిదాయకంగా ఉంటుంది'అని అన్నారు.

    మీరాచోప్రా, కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, నాగినీడు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి, సంగీతం: తమన్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: రవీందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేకానంద కూచిభొట్ల, సహ నిర్మాత: డి.విశ్వచందన్‌రెడ్డి, నిర్మాణం: కామాక్షి మూవీస్.

    English summary
    
 Nagarjuna, Nayanthara starrer Greekuveerudu is going to be dubbed in Tamil. The film’s Tamil version has been titled as ‘Love Story’ and if all goes well, it’ll also release simulataneously along with the Telugu version. Guru Brahma Films has bought the dubbing rights of Greekuveerudu and APK Rajaraja is taking care of the Tamil dubbing for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X