కరోనా వేళ సంతోషకరమైన వార్త.. తండ్రిగా సంగీత దర్శకుడికి ప్రమోషన్
ఓ వైపు సంగీతంతో యువతను ఉర్రూతలూగించడమే కాదు.. నటుడిగానూ విమర్శల ప్రశంసలు అందుకుంటున్నాడు జీవీ ప్రకాశ్. డార్లింగ్ వంటి సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన జీవీ ప్రకాశ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే తెలుగు, తమిళంలో మంచి ఆల్బమ్స్ అందించిన జీవీ.. కోలీవుడ్‌లో హీరోగానూ తన టాలెంట్‌ను చూపిస్తున్నాడు.
కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్‌లో నటిస్తూ మంచి యాక్టర్ అని నిరూపించుకున్నాడు. అలాంటి జీవీ ప్రకాశ్‌కు తండ్రిగా ప్రమోషన్ లభించింది. ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ కథేంటో ఓ సారి చూద్దాం.

జీవీ ప్రకాష్.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు మేనల్లుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన 2013లో తన చిన్ననాటి స్నేహితురాలైన.. గాయని సైంధవిని వివాహం చేసుకున్నాడు. తాజాగాఈ దంపతులకు పండంటి బిడ్డ జన్మించింది. సోమవారం (ఏప్రిల్ 20) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
ఈ శుభ వార్తతో వారి కుటుంబంలో ఆనందం నెలకొంది. పలువురు ప్రముఖులు జీవీ ప్రకాష్, సైంధవి దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జీవీ ప్రకాష్.. ప్రస్తుతం సూరారై పోట్రూ (ఆకాశం నీ హద్దురా) చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మధ్య హీరోగా వచ్చిన 100 పర్సెంట్ కాదల్ (100 పర్సెంట్ లవ్ రీమేక్), సర్వంతాళమయం సినిమాలు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చాయి.


Click it and Unblock the Notifications











