జివి ప్రకాష్-సైంధవి పెళ్లి...మీడియాకు ఆహ్వానం
చెన్నై : చిన్ననాటి స్నేహితులు, ప్రేమికులు అయిన యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్, సింగర్ సైంధవి మరో రెండు రోజుల్లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహం జూన్ 27న జరుగబోతోంది. ఇప్పటికే సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం పలికిన ఈ జంట...తాజాగా మీడియాను కూడా ఆహ్వానించారు.
వీరి వివాహానికి చెన్నైలోని మేయర్ రామనాథన్ చెట్టియార్ హాల్ వేదిక కానుంది. ఉదయం 9 గంటలకు ప్రాంతంలో వివాహ ముహూర్తం నిర్ణయించారు. ఈ వివాహ వేడుకకు వధూవరుల బంధు మిత్రులు, స్నేహితుల, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.
అదే రోజు సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. రిసెప్షన్‌కు సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, ఏఆర్ రెహ్మాన్, అజిత్ కుమార్, విక్రమ్, విజయ్, ఎఎల్ విజయ్, ధనుజయన్ గోవింద్, సూర్య, క్రాంతి, అనుష్క శెట్టి, త్రిషలతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, మళయాలం సినీ రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేయనున్నారు.

జివి ప్రకాష్, సైంధవి మధ్య స్కూల్ డేస్ నుంచి ప్రేమ వ్యవహారం మొదలైంది.

జివి ప్రకాష్ విషయానికి వస్తే... 19 ఏళ్లకే సంగీత దర్శకుడిగా పరిచయం అయి అతి చిన్న వయస్సులోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రజనీకాంత్ చిత్రం కథానాయకుడుకి కూడా ఇతనే సంగీతం అందించటం విశేషం.

తెలుగులో కరుణాకరన్.. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి, ప్రభాస్ డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త చిత్రాలకు సంగీతం సమకూర్చారు.

ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో దాదాపు 30కిపైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.

సైంధవి విషయానికొస్తే తెలుగులో ఆమె మామిడి కొమ్మకి... (ఆవకాయ బిర్యాని), ఎలగెలగ(పరుగు) చిత్రాలుకు పాడింది. ఆమెకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ గాయనిగా గతంలో సత్కరించింది కూడా.


Click it and Unblock the Notifications











