అజిత్ ‘వాలిమై’ ఫస్ట్ లుక్‌పై డైరెక్టర్ క్లారిటీ: అదే జరిగినా బాధపడకుండా చేస్తాడట
అజిత్ 'వాలిమై' ఫస్ట్ లుక్‌పై డైరెక్టర్ క్లారిటీ: అదే జరిగినా బాధపడకుండా చేస్తాడట
సుదీర్ఘ కాలం పాటు హిట్ లేక ఇబ్బందులు పడ్డాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఇలాంటి పరిస్థితుల్లో 'పింక్' రీమేక్‌గా వచ్చిన 'నెర్కొండ పార్వాయి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడతను. దీని తర్వాత ఈ స్టార్ హీరో నటిస్తోన్న చిత్రం 'వాలిమై'. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ డైరెక్టర్ హెచ్ వినోథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. అయినప్పటికీ ఈ మూవీ నుంచి ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ కూడా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికరమై వార్తను చెప్పాడు దర్శకుడు వినోథ్.
'నెర్కొండ పార్వాయి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత అజిత్ కుమార్.. వినోథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'వాలిమై' సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు వినోథ్ దీనిపై మాట్లాడుతూ 'ఫస్ట్ లుక్ పోస్టర్ ఆలస్యం అయినా అందరి అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుంది' అని చెప్పాడు. దీంతో దీనిపై మరింత అంచనాలను పెంచేశాడు.

హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న 'వాలిమై' సినిమాలో అజిత్ కుమార్ బైక్ రేసర్‌గా నటిస్తున్నాడు. అలాగే, మరో పాత్రను కూడా పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని ఏరియాల హక్కులు అప్పుడే అమ్ముడైపోయాయి. ఇక, ఈ సినిమాను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇందులో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా.. తెలుగు యువ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటిస్తున్నాడు. ఇది ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











