లైపో చేయించుకోలేదంటూ హన్సిక
ముద్దుగుమ్మ నుంచి బొద్దుగుమ్మగా మారిన హన్సిక రీసెంట్ గా సన్నబడి అందరికీ షాక్ ఇచ్చింది. దాంతో అందరూ హఠాత్తుగా ఇలా తయారవటానకి కారణం ఆమె లైపో చేయించుకుని కొవ్వు తీయించుకోవటమే అని తేల్చేసారు. ఈ నేఫధ్యంలో హన్సిక మీడియా వద్ద మండిపడుతూ..అటువంటి అవసరం రాలేదని,తాను కష్టపడి ఎక్సర్ సైజులు చేసి మరీ సైజులు తగ్గించుకున్నానని అంది. అయితే బరువు తగ్గడానికి తానేదో శస్త్ర చికిత్స చేయించుకున్నాననడంలో నిజం లేదని పేర్కొంది. ఇటీవల కళాశాల వేడుకలో పాల్గొన్నానని అక్కడొక విద్యార్థి తనను రసగుల్లా అని పిలిచారని హన్సిక చెప్పింది.
ఇటీవల దక్షిణాదిలో బొద్దుగుమ్మగా పిలవబడుతున్న ముద్దుగుమ్మ హన్సిక సన్నగా నాజూగ్గా తయారయ్యింది. దీనికి ఆమె అమెరికాలో శస్త్ర చికిత్స చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. హన్సిక మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించింది. హన్సిక మాట్లాడుతూ తాను అనూహ్యంగా లావు అయ్యానని చెప్పింది. ఈ భారీ శరీరంతో చాలా అవస్థలు పడ్డానని అంది. దీంతో బరువు తగ్గాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. సింగం సీక్వెల్ చిత్రం కోసం నాజూగ్గా తయారవ్వాలని దర్శకుడు హరి కూడా నిబంధన విధించారు అందుకే ఇలా మారాను అంది. దీంతో క్రమం తప్పకుండా నిత్యం వ్యాయామం చేసి సన్నబడ్డానని చెప్పింది. ఇప్పుడు షూటింగ్ సెట్‌లో తనను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారని తెలిపింది.
త్వరలో నాగచైతన్య సరసన హన్సిక త్వరలో నటించబోతోందని సమాచారం. నాగచైతన్య, సునీల్ కలిసి చేయబోతున్న వెట్టై రీమేక్ చిత్రంలో నాగచైతన్య సరసన ఆమెను ఎంపిక చేసారు. సునీల్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం వేట సాగుతోంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రాన్ని రూపొందించిన డాలీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. తమిళంలో లింగు స్వామి డైరక్ట్ చేసిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. యాక్షన్,ఎంటర్టనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఇక హన్సిక తెలుగులో బెల్లంకొండ సురేష్ గతం చిత్రం కందిరీగ లో చేసింది. రామ్ హీరోగా చేసిన ఈ చిత్రం మంచి విజయం సాధించినా ఆమెకు ఆఫర్స్ ఏమీ రాలేదు. తమిళంలో బిజీగా ఉన్న ఆమె..దిల్ రాజు.. నిర్మించిన ఓహ్ మై ప్రెండ్ లో.. సిద్దార్ధ సరసన చేసింది. అయితే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. ఒళ్లు బాగా పెరిగి పోయిన తమిళనాట చిన్న ఖుష్బూ అని పేరు తెచ్చుకుంది. దాంతో అక్కడే ఆమెను బాగ ఎంకరేజ్ చేస్తున్నారు. తెలుగులో ఆమె సరసన యంగ్ హీరోలు చేసేందుకు ఆసక్తి చూపటం లేదు. సీనియర్ హీరోల ప్రక్కన ఆమె చేయటానికి ఇంట్రస్ట్ చూపటం లేదు.


Click it and Unblock the Notifications











