ఎఫైరా.. ఆయన నాకు పెద్ద అన్నయ్యలాంటివాడు.... హన్సిక
ప్రభుదేవాతో నాకు ఎఫైర్ ఉందనే వార్త ఓ వెబ్‌సైట్‌లో వచ్చింది. ఆ వార్త చూసి షాక్ అయ్యాను. ప్రభుదేవాని నేను అన్నయ్యలా భావిస్తాను. ఆయన నాకు పెద్దన్నయ్యలాంటి వాడని గతంలో కూడా చాలా సార్లు చెప్పాను అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది హన్సిక. ఆమె రీసెంట్ గా ఓ మనిషిని ప్రాణాపాయ స్ధితినుంచి కాపాడింది. ఆ విషయంపై కలిసిన మీడియాతో మాట్లాడుతూ ప్రభుదేవా విషయం ప్రస్దావన కు తెచ్చి ఇలా స్పందించింది.
అలాగే నా కారణంగా ఆయనకు, నయనతారకు మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని కూడా రాస్తున్నారు. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజంలేదు. ఎవరో టైమ్‌పాస్ కోసం రాసే ఈ వార్తలు మమ్మల్ని ఎంత బాధిస్తాయో అర్థం చేసుకోమని మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఆర్టిస్టుల జీవితాలతో ఆడుకోవద్దు అంది.
ఇక కెరీర్ గురించి చెబుతూ..టీనేజ్‌లోనే హీరోయిన్ ని కావడంవల్ల నాకో లాభం ఉంది. ఎక్కువ సంవత్సరాలు కెరీర్ ఉంటుంది కాబట్టి.. ఇంకొన్నాళ్ల తర్వాత ప్రయోగాత్మక సినిమాల్లో కూడా నటించే వీలు ఉంది. గ్లామరస్ రోల్స్‌కి నేను వ్యతిరేకం కాదు. కానీ ప్రేక్షకులు ఇబ్బంది పడే రేంజ్‌లో ఉంటే మాత్రం నిర్మొహమాటంగా చేయనని చెప్పేస్తా. అంది. ప్రస్తుతం హన్సిక ..రామ్ సరసన కందిరీగ లోనూ సిద్దార్ద సరనస ఓ మై ప్రెండ్ చిత్రంలోనూ చేస్తోంది.


Click it and Unblock the Notifications











