ఆ ఇద్దరు హీరోయిన్లు ఇంత నీఛమా.. అవకాశాల కోసం అడ్డదారులు.. ఇది చాలా కామన్ అంటూ!

చిత్ర పరిశ్రమలో దర్శక నిర్మాతలు ప్రచారాల కోసం సరికొత్త పంథాని ఎంచుకుంటున్నారు. ఫస్ట్ లుక్ తోనే సినిపై హైప్ పెంచాలంటే అందులో ఎదో ఒక వివాదం ఉండాలి. వివాదం చెలరేగితే సినిమాకు ప్రీ పబ్లిసిటీ వస్తుంది. చాలా మంది దర్శకులు ఈ ఆయుధాన్నే ఉపయోగిస్తున్నారు. తాజాగా యాపిల్ పిల్ల హన్సిక, హాట్ హీరోయిన్ అమలాపాల్ వార్తల్లో నిలిచారు. హన్సిక నటిస్తున్న మహా చిత్ర పోస్టర్ ఇటీవల విదులయింది. ఈ పోస్టర్ లో హన్సిక హుక్కా తాగుతూ కనిపించింది. అమలాపాల్ సిగరెట్ తాగుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది.

మండిపడుతున్న హిందూ సంఘాలు

మండిపడుతున్న హిందూ సంఘాలు

హన్సిక మహా పోస్టర్ పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ చిత్రంపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు నటీనటుల సంఘం, నిర్మాతల మండలిని కోరాయి. వారు స్పందించకపోవడంతో హన్సిక, చిత్ర దర్శకుడు జమీల్ పై కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసారు. ఈ వివాదం రోజు రోజులు పెద్దదవుతోంది.

హన్సిక కాళ్లవద్ద

హన్సిక కాళ్లవద్ద

హన్సిక సాధువుల డ్రెస్ లో హుక్కా తాగుతుండగా ఆమె కాళ్ళ వద్ద కొంతమంది సాధువులు కూర్చుని ఉండడం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఇలాంటి పోస్టర్లతోనే వేరే మతాలని అవమానించే ధైర్యం ఉందా అని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

 ఇది చాలా కామన్

ఇది చాలా కామన్

ఇదిలా ఉండగా దీనిపై హన్సిక స్పందించిన తీరు మరింతగా అగ్గిరాజేసింది. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అంటూ బదులిచ్చింది. దీనికి మించిన విశేషాలు సినిమాలో చాలా ఉన్నాయంటూ వెటకారంగా బదులిచ్చింది. దీనితో హిందూ సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. హన్సిక, అమలాపాల్ లాంటి హీరోయిన్లు అవకాశాలు లేకపోవడంతో ఇలా అడ్డదారులు తొక్కుతూ పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

అమలాపాల్ కు అలవాటే

అమలాపాల్ కు అలవాటే

ఇక హాట్ హీరోయిన్ అమలాపాల్ ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో ఉంటుంది. వివాదాలు ఆమెకు అలవాటే అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో అమలాపాల్ సిగరెట్ తాగుతున్న ఫోటోని షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. చాలా హాట్ గా ఉన్నాయంటూ కొందరు నెటిజన్లు అంటుంటే.. మరికొందరు అమలపాల్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X