నన్ను ఐరన్ లెగ్ అంటే ఊరుకోను: హన్సిక
హన్సిక తమిళ ముచ్చట అప్పుడే తీరిపోయింది. ఆమె నటించిన రెండు చిత్రాలు తమిళంలో విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో ఆమెను తమిళ మీడియా ఐరన్ లెగ్ ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో పక్క హన్సికకు అసలు నటనే రాదు. ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో ఆమె నటనేమీ బాగోలేదు అనే విమర్శలు వస్తున్నాయి. ధనుష్ తో చేసిన మాపిళ్ళై రీమేక్ లో కూడా ఆమే మైనస్ అంటూ రివ్యూలు వచ్చాయి. దాంతో ఆమె అక్కడి మీడియాపై మండిపడుతోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ తనకు నటన రాదని విమర్శించడం బాధగా ఉందని, తాను హిందీ టెలీసీరియల్‌లో నటించి 14 అవార్డులు అందుకున్నానని గుర్తుచేసింది. అలాగే తెలుగులో దేశముదురు చిత్రంలో నటించి అవార్డును గెలుచుకున్నాని తెలిపింది. నటన తెలియకుంటే ఇన్ని అవార్డులు ఎలా వస్తాయని ప్రశ్నింస్తోంది. హన్సిక ప్రస్తుతం విజయ్ సరసన వేలాయుధం, ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా ఒరుకల్ ఒరు కన్నాడి చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











