Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
దేవుని కుమార్తెగా అతీత శక్తులతో హన్సిక
హైదరాబాద్ : హాట్ బ్యూటీ హన్సీక త్వరలో దేముడు కుమార్తె గా కనిపించి అలరించనుంది. సుందర్ సి.దర్శకత్వంలో రూపొందుతున్న అరాన్ మనై చిత్రంలో ఆమె ఈ డిఫెరెంట్ క్యారెక్టర్ ని చేస్తోంది. హన్సికకి ఈ చిత్రంలో కొన్ని దైవిక శక్తులు ఉంటాయి. తన శక్తులతో రోగాలను నయం చేయగలదు.. భవిష్యత్ లోకి చూడగలదు. ఆమె పాత్ర కథలో ట్విస్ట్ ఇస్తూ సాగుతుందని తమిళ వర్గాలు చెప్తున్నాయి.
మరో ప్రక్క హన్సికను మరోసారి మంచు కుటుంబం తమ హీరోకి ఎంపిక చేసారు. అయితే ఇప్పుడు హీరో మంచు మనోజ్. ఈ చిత్రానికి దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. . యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనుంది. ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా సినిమా రూపొందిచే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో మంచు మనోజ్ కొత్త గెటప్ లో కనిపిస్తాడు. లక్ష్మి ప్రసన్న బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది.
ఇటీవల హన్సికకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. దర్శకులు కొత్త కథలు వినిపిస్తామంటూ వెంటపడుతున్నారట. వరస ఆఫర్స్ తో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇన్నాళ్ళూ బొద్దు పాపలాగ ఉందని ప్రక్కన పెట్టినవాళ్లంతా ఆమె సన్నబడటంతో సై అంటూ ముందుకు దూకుతున్నారు. పట్టుబట్టి మరీ బరువు తగ్గి తన అందాలకు పదును పెట్టిన హన్సిక మళ్లీ పీక్‌టైమ్‌లోకి చేరిందని అంటున్నారు సినీ జనం.
ఆ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ ''అవును, నేను రోజూ అయిదారు కథల్ని వింటున్నాను. వాటిలో నచ్చిన కథల్ని మాత్రమే ఎంచుకొంటున్నా. కథల ఎంపికలో పరిణతి ప్రదర్శిస్తున్నా. గతంతో పోలిస్తే... తక్కువ తప్పులు చేస్తున్నాను. చేస్తున్న చాలా చిత్రాలు మంచి ఫలితాల్ని తెస్తున్నాయి''అని చెప్పుకొచ్చింది. అయితే సన్నబడటం వల్లే ఆఫర్స్ వస్తున్నాయట కదా? అని అడిగితే... ''అది పూర్తిగా అబద్ధం. బొద్దుగా ఉన్నప్పుడు బోలెడన్ని సినిమాలు చేశాను. ఇలా నాజూగ్గా తయారయ్యాక కూడా సినిమాలు చేస్తున్నా. బరువు నాకు ఎప్పుడూ సమస్య కాలేదు'' అని చెప్పుకొచ్చింది.
పెళ్లి గురించి మాట్లాడుతూ ''నా చేతినిండా సినిమాలున్నాయి. వ్యక్తిగత జీవితాన్ని కూడా సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నా. ఇక పెళ్లికొచ్చిన తొందరేముంది చెప్పండి? ఇంకా నా వయసు ఇరవై రెండే కదా?'' అని చెప్పుకొచ్చింది. హన్సిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఏడు సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'బిర్యానీ' చిత్రంలో హన్సిక పాత్రికేయురాలిగా కనిపిస్తుందట.
'దేశముదురు'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తరువాత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టడంతో కెరీర్ కోల్పోయింది. ఆ తరువాత తమిళానికి వెళ్లి గుడి కట్టించుకునే స్థాయికి వెళ్లింది. తాజాగా తెలుగులో నితిన్‌తో ఓ చిత్రం చేస్తోందట. కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. ఇప్పటికే నాగచైతన్య, మంచు విష్ణుతో మరో రెండు చిత్రాలకు కమిట్ అయింది. ఇదే సమయంలో తమిళంలోనూ నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది.