జూనియర్ ఖుష్బూ అంటున్నారని మురస్తోంది
హన్సికని తమిళంలో అక్కడి అభిమానులు జూనియర్ ఖుష్బూ అంటూ పిలుస్తున్నారు. దాంతో ఆమె చాలా సంతోష పడిపోతోంది. ఆమె లావుగా అవ్వటంతో అక్కడి వారు ఆమె ఖుష్బూని చూసుకుని మురిసిపోతున్నారు. అయితే తెలుగులో మాత్రం అందరూ కందిరీగలో ఆమె ను చూసి జూనియర్ నమిత అని అన్నారు. ఇక ఆమె ప్రస్తుతం తెలుగులో దిల్‌రాజు నిర్మిస్తున్న 'ఓ మై ఫ్రెండ్' చిత్రంలో నటిస్తోంది. సిద్దార్ద హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా మరో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా తప్ప ఆమెకు తెలుగులో మరో ఆపర్ లేదు. అయినా తమిళంలో ఆమెకు వరస ఆఫర్స్ రావటంతో ఆమె చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఆమె 'వేలాయుధం' 'ఒకే ఒకే' చిత్రాల్లో నటిస్తోంది. అంతేగాక విజయ్‌తో కలిసి 'వేట్టై మణ్ణన్' చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రాన్ని మొత్తం అమెరికా, యూరప్‌లో చిత్రీకరించనున్నారట. దీనికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ మీ కెరీర్ ఎలా ఉందని ఆమను మీడియా వారు ప్రశ్నిస్తే... "నేను దేనికీ తొందరపడను. తెలుగులో 'దేశముదురు'లో నటించిన వైశాలి కేరక్టర్ అంటే నాకు ఇష్టం. ఆ చిత్రంతోనే నాకు మంచి పేరు వచ్చింది. అలాగే 'కంత్రి' చిత్రంలోనూ నా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత వచ్చిన కొన్ని సినిమాలు విజయం సాధించలేదు. అయినా నేను నిరుత్సాహ పడలేదు. అవకాశాలకోసం ఎదురు చూశాను. తమిళంలో మంచి చిత్రాల్లో నటించే ఛాన్సులొచ్చాయి. దాంతో మళ్ళీ ఇప్పుడు తెలుగులో కూడా వస్తున్నాయి. 'కందిరీగ' మంచి ఎనర్జీని ఇచ్చింది. దీనిని కంటిన్యూ చేస్తా'' అంది.


Click it and Unblock the Notifications











