Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిర్మాతలకు ట్విస్టులు ఇస్తున్న దేశముదురు హీరోయిన్
హన్సిక పేరు తలుచుకుంటేనే ఇప్పుడు నిర్మాతలకు గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. దానికి కారణం...ఆమె వారికి రకరకాలగా ట్విస్టులు ఇస్తూ బడ్జెట్ పెంచటంలో తన వంతు సాయిం చేయటమే. ముఖ్యంగా హన్సిక షూటింగ్ స్పాట్‌కి వస్తే ఆమె వెంట పెద్ద బెటాలయిన్ బయిలుదేరి వస్తోంది. వారి సర్వ అవసరాలు నిర్మాతే దగ్గరుండి చూడాలి. అలాగే ఆమె లొకేషన్ ఎలాంటిదయినా తను మాత్రం స్టార్ హోటల్ రేంజినే మెయింటైన్ చేస్తుంది. ప్రతీ సినిమాకూ రెమ్యునేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోతోంది. హీరోలకు, దర్శకులకు దగ్గరై నిర్మాతను పూచికపుల్లలా తీసిపారేస్తుంది. ప్రమోషన్ కోసం మీడియా ముందుకు రావాలంటే ఆమెకు ప్రత్యేకంగా చెల్లించటం చేయాలి, అది కూడా డేట్స్ లో భాగంగా ఆమె భావిస్తుంది. రిలీజయ్యాక పొరపాటున కూడా సినిమాని ప్రమోట్ చేయనని అంటోంది. ఇన్ని కండీషన్స్ ఉన్నా ఆమెకు ఆఫర్స్ కేమీ కొదవలేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో రామ్‌తో 'కందిరీగ"లో నటిస్తోంది. నారా రోహిత్ సరసన ప్రకాష్ దర్శకత్వంలో ఓకే చేసింది. ఇక తమిళంలో ఐదు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. జయం రవికి జంటగా 'ఎంగేయుమ్ కాదల్", విజయ్‌తో 'వేలాయుధం", ధనుష్‌తో 'మా ప్పిళ్లై" చిత్రాల్లో నటిస్తోంది. ఇదేకాక తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా పరిచయమవుతున్న 'ఒరుకల్ ఒరు కన్నాడి", విశాల్‌తో మరో చిత్రాన్ని అంగీకరించింది. ఈ రెండు చిత్రాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.