'డిల్లీ బెల్లి' రీమేక్ లో హన్సిక ఖరారు
హిందీలో ఘన విజయం సాధించిన చిత్రం డిల్లీ బెల్లి. ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో రూపొందుతోంది. ఆర్య, సంతానం ప్రధాన పాత్రలుగా రూపొందే ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా చేస్తోంది. యు టివి మోషన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఆర్య,సంతానం కాంబినేషన్ లో వచ్చిన బాస్ ఎనగర భాస్కరన్ సూపర్ హిట్ కావటంతో అదే కాంబినేషన్ లో చేస్తే మళ్లీ నవ్వులతో ధియోటర్ మారు మ్రోగుతుందని భావిస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని కన్నన్ డైరక్ట్ చేస్తున్నారు. ఇక హన్సిక విషయానికి వస్తే అంత బిజీ స్టార్ కానప్పటికీ హన్సికా మోత్వానీ అంటే యూత్‌లో ఒక ఫాలోయింగ్ ఉంది. గత ఏడాది 'కందిరీగ', 'ఓ మై ఫ్రెండ్' రూపంలో తనకు మంచి హిట్స్ వచ్చాయంటోంది. ప్రస్తుతం తమిళంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లతో బిజిగా ఉన్న ఒకప్పటి ఈ బాలతారకు అక్కడ విజయ్ సరసన నటించిన 'వేలాయుధం' చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. తమిళంలో ఒకప్పటి హీరోయిన్లు ఖుష్బూ, నగ్మాల తర్వాత హన్సికకి మాత్రమే ఇంతటి ఫాలోయింగ్ కనిపించిందని అక్కడ పత్రికలు అంటున్నాయి. అందుకే అక్కడ పెద్ద సంస్ధలు దృష్టి మొత్తం హన్సిక మీదే పెట్టాయి.


Click it and Unblock the Notifications











