ఆయనతో ఆ సంభందమా? కళ్ళు పోతాయి: హన్సిక

By Srikanya

నయనతారతోనే కాకుండా హన్సికతోనూ ప్రభుదేవా ప్రేమాయణం నడుపుతున్నాడంటూ తమిళ మీడియా కోడై కోస్తున్న నేపధ్యంలో హన్సిక ఈ విషయమై సీరియస్ అవుతోంది. మాది అన్నా చెల్లెళ్ళ అనుభందం..అలాంటి మా మీద ఇలాంటి రూమర్స్ లేపితే కళ్ళు పోతాయి అని వార్నింగ్ లు ఇస్తోంది. ఇక ఈ గొడవ మొత్తం ప్రభుదేవా దర్శకత్వంలో హన్సిక నటిస్తున్న ఎంగేయుమ్ కాదల్ అనే తమిళ చిత్రం షూటింగ్ సమయంలో మొదలయ్యాయి. ఈ షూటింగ్ వీరిద్దరూ కాస్త కలివిడిగా మెలగారని, ఇద్దరూ కలిసి షాపింగ్ లకు వెళ్ళారని, ప్రభుదేవా అండతో తమిళ పరిశ్రమలో ఆమె ఆఫర్స్ పట్టుకునే ప్రయత్నాలు చేసిందని చెప్తున్నారు. ఇక హన్సిక...ప్రభుదేవా సార్ నాకు పెద్దన్నయ్యలాంటివారు ఆ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోవడంలేదు. లేనిపోని రూమర్స్ సృష్టిస్తున్నారు. అవి విని నాకు విసుగొచ్చేసింది. నా సహనం కూడా నశించింది. అందుకే ఇగ్నోర్ అనే పదాన్ని మైండ్‌లోకి తెచ్చుకున్నా.

మా అనుబంధాన్ని వక్రీకరించి ఎవరు మాట్లాడినా..ఈ చెవిలో విని ఆ చెవిలోంచి వదిలేస్తాను. ఎవరికీ సమాధానం చెప్పను, సంజాయిషీ ఇచ్చుకోను. మేమేంటో మాకు తెలుసు అన్నారు అని స్టేట్ మెంట్స్ ఇస్తోంది. అలాగే ట్విట్టర్ లోనూ ఈ విషయాన్ని ప్రస్దావిస్తూ..ప్రభు సార్ నన్ను కౌగిలించుకుని నీ పెద్ద అన్నయ్య నీతోనే ఎప్పుడూ ఉంటాడు. నువ్వు అద్భుతంగా నా చిత్రంలో చేసావు అన్నారు. సో స్వీట్ ఆఫ్ ప్రభు..ఈ బంధం ఓ బహుమతి లాంటింది అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం హన్సిక తెలుగులో రామ్ సరసన కందిరీగ అనే చిత్రంలో చేస్తోంది. దేశముదురు చిత్రంతో తెలుగు నాట స్టార్ గా ఎదిగిన ఈ అందాల భామ మాప్పిళ్లై చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ధనుష్ ‌కు జంటగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే జయం రవికి జంటగా ఎంగెందుమ్ కాదల్, విజయ్ సరసన వేలాయుధం, ఎంగెందు మ్ కాదల్ చిత్రాల్లో నటించే అవకాశాలను పొందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X