హన్సికకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
ధనుష్, హన్సిక జంటగా 'మాపిళ్లై' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల తిరునల్వేలోని ఓ మారుమూల గ్రామంలో జరిగింది. ధనుష్, హన్సిక కాంబినేషన్లో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఆ షూటింగ్ కోసం ఆరు ట్రాక్టర్లను వాడుతున్నారు. సమయంలో అనుకోకుండా ట్రాక్టర్ ఆ లొకేషన్‌లోకి దూసుకొచ్చింది. నలుగురు వ్యక్తులను గాయపరిచి హన్సిక వైపుకు దూసుకు వస్తున్న ఆ ట్రాక్టర్‌ను ధనుష్ గమనించి వెంటనే ఆమెను ప్రక్కకు తోసేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ హఠాత్పరిణామానికి షాక్ అయిన హన్సిక భయంతో ఏడవటం మొదలుపెట్టింది. షాక్ నుంచి ముందుగా కోలకున్న యూనిట్ సభ్యులు ఆమెను సముదాయించడంతో కాసేపటికి ఆమె తేరుకుంది. ఈ ప్రమాదం కారణంగా కొన్ని గంటల పాటు షూటింగ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ఇక ఈ చిత్రం రజనీకాంత్, అమల జంటగా నటించిన 'మాపిళ్లై' చిత్రానికి రీమేక్. ఆ చిత్రంలో రజనీకి అత్తగా శ్రీవిద్య నటించారు. తాజా చిత్రంలో మనీషా కొయిరాలా అత్త పాత్ర పోషిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత మనీషా నటిస్తున్న చిత్రం ఇది.


Click it and Unblock the Notifications











