ఆ హీరోయిన్ ని చూసి వణికిపోతున్న హన్సిక
హన్సిక గత కొద్ది రోజులుగా చాలా టెన్షగా ఉంది. దానకి కారణం తాప్సీ అంటున్నాయి తమిళ పత్రికలు.వారు కారణం వివరిస్తూ...తెలగు పరిశ్రమలో వేషాలు కరువై తమిళంలో దున్నేద్దామని వచ్చిన హన్సికకు తాప్సీ గట్టి పోటీ ఇచ్చేటట్లు కనపడుతోంది.తాప్సీ తాజా చిత్రం ఆడుకలాం లో ఆమె ఆరబోసిన అందాలు తమళ తంబీలను నిద్రపట్టనివ్వకుండా చేసి ఊపేస్తున్నాయి. మరో ప్రక్క ట్రైలర్స్ టీవిల్లో హాట్ టాపిక్ గా మారాయి.ఈ చిత్రంపై హీరో ధనుష్ కూడా చాలా అంచనాలు పెట్టుకున్నాడు. దాంతో సంక్రాంతికి విడుదల అవుతున్న ఆ చిత్రం హిట్టయితై హన్సిక ఛాప్టర్ క్లోజ్ అంటున్నారు.
అయితే హన్సిక ఈ విషయమై ఘాటుగానే స్పందించింది...వాళ్లకు ఏదో ఒక న్యూస్ కావాలి. అందుకే అలా రాస్తూంటారు. ఇది కేవలం రూమర్ మాత్రమే. సినిమారంగంలో నిరంతరం కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. ఇది నాచురల్. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలన్నీ పెద్ద సినిమాలు. మంచి కథాబలం ఉన్న సినిమాలు కూడా. ఆ సినిమాలపై ఎంతో నమ్మకంతో ఉన్నాను. ఇక వేరేవాళ్లను చూసి టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. అయినా తాప్సీకి నా బెస్ట్ విషెష్.ఆమె చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా అంది. ఇక ఈ దేశముదురు భామ తాజాగా రామ్ సరసన కందిరీగ చిత్రంలో చేస్తోంది. అలాగే నారా రోహిత్ సరసన సుకుమార్ అశోసియోట్ ప్రకాష్ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటైంది.


Click it and Unblock the Notifications











