twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెల్లటి ఇడ్లీ అని పిలుస్తున్నారని మురసిపోతోంది

    By Srikanya
    |

    ఓ సెట్‌లో థర్మాకోల్ అని పిలిస్తే, మరో సెట్‌లో వెళ్ళ ఇడ్లీ (తెల్లటి ఇడ్లీ) అని అంటున్నారు. ఇంకొకరేమో మల్లిగై పూ (మల్లిపువ్వు) అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది'' అని చెప్తోంది హన్సిక. అలాగే నా సినిమా ఒకటి కూడా విడుదల కాకముందే తమిళం నన్ను గుర్తుపట్టసాగారు. సినిమాల పట్ల అక్కడ అంత అవగాహన ఉంది అని చెప్పుకొచ్చింది.'కందిరీగ" సక్సెస్‌తో హన్సికకి మాట్లాడే ఛాన్సు చాలా వచ్చింది. 'దేశముదురు" తర్వాత తను తెలుగు సినిమాల్ని చూడలేదని చెప్పుకొచ్చింది. చూడకపోవడమే మంచిదైంది. వృత్తిపట్ల తన శ్రద్ధ ఇలా వుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఇప్పుడు 'కందిరీగ"ని కూడా చూసిందో లేదో తెలీదు చూసి వుంటే, జూనియర్ నమితలా వున్న తనని చూసుకుని షాక్ తిని వుండాలి అంటున్నారు.

    ఈ షాక్‌తో ఇక జన్మలో తన సినిమాల్ని తను చూడదు. అయితే తన ఆకృతి గురించి వస్తున్న కామెంట్స్‌కి అసలు విషయం బోధపడి అర్జెంటుగా బాడీని తిరిగి నార్మల్ స్థితికి తెచ్చుకునేందుకు ఫారిన్‌టూరు కట్టింది. అలాగే తమిళ ప్రేక్షకులు తనని చిన్న కుష్బూ అని ఆప్యాయంగా పిలుస్తున్నారని వెల్లడించింది. జూనియర్ నమిత పేరుతోనే అల్లకల్లోలం రేగితే, చిన్న కుష్బూ అనడం తమిళులకే చెల్లింది. పోలికలు చెప్పుకుని జీవించడం మానేస్తే హన్సిక హంసలా అలరించే అవకాశాలెక్కువున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు.ప్రస్తుతం ఆమె సిద్దార్ధ సరస దిల్ రాజు నిర్మిస్తున్న ఓ మై ప్రెండ్ చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు.

    English summary
    Hansika busy with 'Oh My friend' Movie and other Tamil films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X