For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్లిమ్ అవుతా కోటిచ్చుకోమంటోంది....!?

  By Sindhu
  |

  'తెలుగులో కొంత గ్యాప్ తర్వాత నేను నటించిన 'కందిరీగ" మరో సారి నాకు శుభారంబాన్ని అందించి నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. 'కందిరీగ" చిత్రంతో ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు"అన్నారు హన్సిక. ఆమె కథానాయికగా రామ్ కథానాయకుడిగా శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లం కొండ సురేష్ నిర్మించిన చిత్రం 'కందిరీగ". ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయల సమావేశంలో ఆమె మాట్లాడుతూ'మస్కా తర్వాత రామ్‌తో నటించిన రెండవ చిత్రమిది. రామ్‌తో రెండవ సారి కలిసి నటించడం, ఆచిత్రం మంచి విజయం సాధించడం చాలా ఆనందంగా వుంది. నిర్మాత బెల్లం కొండ సురేష్ ఓ బ్రదర్‌లా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. ఆయన సంస్థలో మరో చిత్రం చేయాలని వుంది అంటోంది హన్సిక.

  ఇక నేను 'బిజినెస్ మెన్" చిత్రంలో నటిస్తున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదు. ప్రస్తుతం తమిళ్‌లో విజయ్‌తో నటించిన 'వేళాయుధం" విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంతో పాటు మరో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక తెలుగులో దిల్‌రాజు నిర్మిస్తున్న 'ఓ మై ఫ్రెండ్" చిత్రంలో సిద్ధార్ధకు జోడీగా నటిస్తున్నాను. ఇందులో నా పాత్ర నేను ఇంత వరకు చేసిన పాత్రల కంటే భిన్నంగా వుంటుంది"అన్నారు.

  అంతే కాదు 'దేశముదురు" పోరీ హన్సికకు కోటీచ్చుకోవాలట. 'కందిరీగ" సినిమాతో భారీగా కుట్టిన ఈ తెల్ల తోలు బ్యూటీ ఆ సినిమా సక్సెస్ తో తన రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయిందని చెబుతూనే. ఆల్రెడీ గతంలోనే తాను కోటి రెమ్యునరేషన్ అందుకున్నాననీ, కాస్త గ్యాప్ రావడంతో తెలుగులో రెమ్యునరేషన్ తగ్గించుకుని 'కందిరీగ" చేయాల్సి వచ్చిందనీ, ఇకపై తనకు కోటి చెల్లించుకుంటేనే ఒప్పుకుంటానని టాలీవుడ్ దర్శక నిర్మాతలకు భారీ రేట్ ట్యాగ్ చూపిస్తోందిప్పుడు హన్సిక.

  ఈ భారీ అందాల సుందరి కోటిచ్చుకోవడం వేస్ట్ అని టాలీవుడ్ జనం ఆల్రెడీ ఫిక్సయ్యారనుకోండి..అది వేరే సంగతి..కాస్త స్లిమ్ అయ్యి సత్తా చాటుకుంటానంటోన్న హన్సిక, కోలీవుడ్ లోనూ తన రేటు కోటీ పలుకుతోందని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో...హిట్ ని ఎలా క్యాష్ చేసుకోవాలో బాగా తెల్సిన హన్సిక, చెన్నైయ్ నుంచి మకాం హైదరాబాద్ కి మార్చేసింది. ఇకపై రెగ్యులర్ తెలుగు సినిమాల్లోనే కన్పిస్తానని హన్సిక అంటోంది.

  English summary
  Hansika Motwani is having a high time in the Tamil Film Industry. The Sindhi girl is definitely on a roll, and is one of the busiest heroine, even before her first film gets released. Hansika Motwani is presently she is working under Jayam Raja's Direction for Velayudham alongside Vijay and Genelia D 'Souza.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X