డాక్టర్‌ని కాబోయి యాక్టర్ ని అయ్యానంటుంటారు..?
డాక్టర్ ని కాబోయి యాక్టర్ ని అయ్యానని చాలామంది అంటుంటారు. అదే విషయాన్ని హన్సిక ముందుంచి.. మీరేం కావాలనుకున్నారు? అని అడిగితే -'నేనేమీ అవ్వాలనుకోలేదు. అసలు ఆ విషయం గురించి ఆలోచించే అవకాశమే నాకు రాలేదు. బాలనటిగా కొన్ని సినిమాలు చేశాను. టీనేజ్ లోకొచ్చిన తర్వాత హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. చిన్నప్పుడే ఆరంభమైన కెరీర్ కాబట్టి సినిమాల్లో కంటిన్యూ అయ్యాను. హీరోయిన్ అయిన తర్వాత గ్యాప్ లేకుండా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నాను.
దాంతో నటిని కాకపోయి ఉంటే ఏమయ్యేదాన్ని అని ఆలోచించడానికి సమయం చిక్కలేదు"అన్నారు. కెరీర్ పరంగా నాలో ఏదైనా తప్పు ఉందనిపిస్తే అప్పటికప్పుడు మార్చుకుంటా. అలాగే కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త నిర్ణయాలు తీసుకునే అలవాటు కూడా లేదు" అన్నారు. ఇటు తెలుగు అటు తమిళంలో పెద్ద బేనర్స్‌లో, ప్రముఖ హీరోల సరసన నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారామె. ముఖ్యంగా మీకు ఏ హీరో సరసన, ఏ దర్శకుడితో, ఏ బేనర్ లో చేయాలని ఉంది? అని అడిగినప్పుడు - ''నేను స్వార్థపరురాలిని. అందరి హీరోల సరసన చేయాలనే స్వార్థం నాది. అలాగే అన్ని బేనర్స్ లోనూ, అందరి దర్శకులతోనూ సినిమాలు చేయాలన్నది నా సంకల్పం" అన్నారు హన్సిక.


Click it and Unblock the Notifications











