జూ కుష్బూ కాదు, జూ నమిత అంటూ పక్కన పెట్టుస్తున్నారు...!?

By Sindhu

దేశముదురు భామగా పరిచయమై తెలుగులో అవకాశాలు సన్నగిల్లడంతో తమిళ సీమలో కాలుమోపి అక్కడా విజయఢంకా మోగిస్తోంది హన్సిక. అక్కడ జనం ఏకంగా జూనియర్‌ కుష్బూ అంటూ హన్సికకు ఏకంగా బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఎప్పటికైనా తెలుగులో మంచి బ్రేక్‌ రావాలని ఆశిస్తున్న హన్సికకు 'కందిరీగ" రూపంలో మంచి హిట్‌ వచ్చిపడింది. అయితే ఆ చిత్రంలో బొద్దుగా ఉందనే పేరు తెచ్చుకుంది.

అయినా అటువంటి విమర్శలను లెక్కచేయక తాజాగా సిద్దార్థతో కలిసి 'ఓ మై ఫ్రెండ్" చిత్రంలో కూడా నటించింది. అయితే ఆ చిత్రం కూడా హన్సికకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఓ మై ఫ్రెండ్ చిత్రం కూడా యూత్‌ ను ఆకర్షిస్తూ స్టడీగా కలెక్షన్లను రాబడుతోంది. ఏది ఏమైనా హన్సికకు ఈ రెండు చిత్రాలు మళ్లీ టాలీవుడ్గలో కాలుమోపేందుకు సహకరిం చాయనే చెప్పాలి. దీంతో హన్సిక ఆనంద పరవశురాలైపో తోంది. అయితే తెలుగు వారికి మరీ బొద్దందాలను ఆదరించరనే సంగతి హన్సికకు తెలియదనుకుంటా!

ఓ పక్క అందంగా ఉన్నావంటూనే, లావయిపోయావంటున్నారు. ఓ పక్క బొద్దుగా ఉంటేనే ముద్దు అంటుంటే, మరో పక్క ఇంత లావయితే కష్టం అంటున్నారు. ఇవీ ఇప్పుడు హన్సిక కష్టాలు. తెలుగు ఆడియన్స్ కు మాత్రం జూనియర్ నమితలా ఉందంటూ పక్కన పెట్టేస్తున్నారు. టాలీవుడ్ దర్శక నిర్మాతలకు స్లిమ్ గా ఉంటేనే ఇష్టం. కందిరీగతో చాలా రోజులు తరువాత తెలుగు స్క్రీన్ పై చూసిన ఆడియన్స్ హన్సిక ను చూడటానికి కాస్త కష్టపడ్డారు.

ఆ తరువాత ఓ మై ఫ్రెండ్ లోనూ అదే పరిస్థితి. మెయిన్ హీరోయిన్ హన్సిక అయితే, తన బొద్దుతనం చూడలేని ప్రేక్షకులు తన పక్కనున్న మరో హీరోయిన్ కు ఎక్కువ మార్కులు వేస్తున్నారు. దీంతో హన్సిక హార్ట్ అయ్యింది. తెలుగులో టాప్ పొజిషన్ కు వెళ్ళాలంటే స్లిమ్ గా అవ్వాల్సిందేనని నిర్ణయించుకొని బాగా కష్టపడుతుందట. రోజుకు ఇన్ని గంటలు అని లెక్కపెట్టకుండా గంటల తరబడి బీచ్ లలో యోగా చేస్తుందట. నెక్స్ట్ తెలుగు సినిమాలో మునుపటి గ్లామర్ తో స్క్రీన్ షేక్ చేయడానికి బాడీ షేప్ మార్చే పనిలో బిజీగా ఉంది ఈ కంత్రి పిల్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X