సర్ ఫ్రైజింగ్ గా ఉంటుందని శింబు కోరిక కాదనలేకపోయా..!
'దేశముదురు" చిత్రం ద్వారా తెలుగు తెరంగేట్రం చేసిన హన్సిక రామ్ తో బెల్లంకొండ సురేష్ నిర్మించిన 'కందిరీగ"తో మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ చిత్రం విజయం తర్వాత సిద్ధార్థతో దిల్ రాజు నిర్మిస్తున్న 'ఓ మై ఫ్రెండ్" చిత్రంలో నటిస్తుంది. విజయ్ తో హన్సిక నటించిన తమిళ చిత్రం 'వేలాయుధం" దీపావళికి విడుదలవుతోంది. ఈ చిత్రంతో పాటు శింబుతో 'వెట్టయ్ మన్నన్", ఉదయనిధి స్టాలిన్ తో 'ఒరుకాల్ ఒరు కన్నడి" చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉంది.
హీరో శింబు పిలిచి అవకాశమిచ్చేసరికి కాదనలేకపోయిందట 'దేశముదురు" హన్సిక. తమిళంలో శింబు హీరోగా తెరకెక్కుతోన్న 'వెట్టయ్ మన్నన్" సినిమాలో దీక్షాసేథ్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం విధితమే. తాజాగా ఈ సినిమాలో హన్సిక వచ్చి చేరింది. శింబు ఏరికోరి మరీ హన్సికను పిలిపించుకున్నాడని కోలీవుడ్ లో గుసగుసలు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమా చాలా స్టయిలిష్ గా వుంటుందని చెబుతోంది హన్సిక. తన పాత్ర సినిమాలో సర్ ప్రైజింగ్ గా వుంటుందనీ, తాను స్ర్కీన్ పై కన్పించగానే ప్రేక్షకులు థ్రిల్లవుతారనీ, 'వెట్టయ్ మన్నన్" సినిమా గురించి హన్సిక చెప్పుకొచ్చింది తాజాగా ఓ ఇంటర్వూలో...
తమిళంలో భారీ అవకాశాలు వస్తున్నాయి. తమిళ చిత్రాలతో బిజీగా వున్న నేను త్వరలో బాలీవుడ్‌లో మిథున్ చక్రవర్తి కుమారుడు హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో నాయికగా నటించబోతున్నాను. ప్రస్తుతం నా టైమ్ బాగుంది" అంటోంది హన్సిక. హన్సిక మాటలెలా వున్నా, ఈ సినిమాపై శింబు చాలా ఆశలే పెట్టుకున్నాడు. శింబుతోపాటు 'వెట్టయ్ మారన్" సినిమా తనకూ మంచి క్రేజ్ ఇస్తుందని చెబుతోంది ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న దీక్షా సేథ్.


Click it and Unblock the Notifications











