Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘డ్రీమ్ గర్ల్’ హోదా సొంతం చేసుకున్న హన్సిక
హీరోయిన్గా మంచి స్థాయికి ఎదగాలని హీరోయిన్ హన్సిక చేస్తున్న ప్రయత్నం ఫలించినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం తమిళ సినిమాలో జోరుగా రాణిస్తున్న ఈ భామ...తమిళ ప్రేక్షకుల ఆరాధ్య హీరోయిన్ కావాలని ఎప్పటి నుంచో కలలు కంటోంది. తాజాగా ఆమె కల ఫలించింది. సింగపూర్ తమిళ అసోసియేషన్ వారు ఈ క్యూట్ భామకు 'డ్రీమ్ గర్ల్ ఆఫ్ తమిళ సినిమా'హోదా ఇచ్చారు. అభిమానులు తనను డ్రీమ్ గర్ల్‌గా పిలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హన్సిక ఉబ్బితబ్బిబ్బవుతోంది.
తమిళులు హీరోయిన్లపై చూపే అభిమానం అంతా ఇంతా కాదు. వారికి నచ్చితే అందలం ఎక్కించడమే కాదు, దేవాలయాలు నిర్మించి పూజలు కూడా చేశారు. కష్భూతో పాటు చాలా మంది హీరోయిన్లు తమిళుల మనుసు దోచి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. తాజాగా ఆ లిస్టులో హన్సిక కూడా చేరింది. వారికి బొద్దుగా, బాగా కండ పట్టి మంచి షేపులు ఉన్న పిటపిటలాడే హీరోయిన్లు అంటే చాలా ఇష్టం అందుకే హన్సికను అంతలా ఇష్ట పడుతున్నారు.
ప్రస్తుతం హన్సిక తెలుగులో మంచు విష్ణు హీరోగా రూపొందబోయే..'దొరకడు' చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. అదే విధంగా తమిళంలో 'ఓకే..ఓకే' అనే చిత్రంలో నటిస్తోంది.