హన్సికతో ఇష్క్ తమిళ రీమేక్
హైదరాబాద్: నితిన్, నిత్యా మీనన్ జంటగా రూపొందిన 'ఇష్క్' చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్ గౌడ్ నిర్మించిన ఇష్క్ చిత్రాన్ని నిర్మించగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్ గా పని చేసారు.
తాజాగా 'ఇష్క్' చిత్రం తమిళంలో రీమేక్ కాబోతోంది. హన్సిక హీరోయిన్ గా నటించనున్న చిత్రంలో హీరోగా సిద్దార్థ్(జయప్రద కజిన్) హీరోగా నటించనున్నాడు. అక్టోబర్లో చిత్రం ప్రారంభం కానుంది. తెలుగు,తమిళ భాషల్లో హన్సిక బిజీ స్టార్ గా ఎదుగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆమె తమిళనాట ప్లే బోయ్ హీరోగా పేరొందిన శింబు సరసన తమిళంలో 'వాలు' పేరుతో రూపొందుతున్న చిత్రంలో చేస్తోంది. విజయచంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నందినీ ఫిలిమ్స్ అధినేత ఎస్‌వీరావు తెలుగు హక్కులను పొందారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హన్సిక పాత్ర సినిమాకు కీలకమై నిలుస్తుందని,ఆమె అభిమానులను అలరిస్తుందని చెప్తున్నారు.
మరో వైపు హన్సిక మంచు విష్ణు వర్ధన్ తో చేస్తున్న 'దేనికైనా రెడీ' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. విష్ణు, హన్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్రం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా.మోహన్‌బాబు సమర్పణలో రూపుదిద్దుకుంటోంది. ఆసక్తిరమైన కథాంశానికి వినోదాన్ని జోడించి దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











