కుర్ర హీరోతో హన్సిక అఫైర్.. పీకల్లోతూ ప్రేమలో మరోసారి.. ఎవరితోనంటే..
Recommended Video

తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ స్టార్ హన్సిక మోత్వాని. అయితే ఆమె గురించి వార్తలు కూడా హాట్ హాట్‌గా ఉంటాయి. పలువురు కోలీవుడ్ హీరోలతో ఆమెకు అఫైర్లు ఉన్నాయనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. శింబు, జయం రవి, సిద్ధార్థ్‌తో అఫైర్ వార్తలు మీడియాలో షికారు చేశాయి. అయితే తాజాగా ఓ యువ నటుడితో పీకల్లోతు ప్రేమలో పడినట్టు ఓ రూమర్ వైరల్‌గా మారింది. హన్సిక అఫైర్ల గురించి పూర్తి వివరాలు...

శింబుతో అఫైర్.. బ్రేకప్..
ఈ ఏడాది ఆరంభంలో శింబుతో హన్సిక ప్రేమలో పడింది అనే వార్తలు మీడియాలో ప్రముఖంగా కనిపించాయి. ఆ తర్వాత వెంటనే శింబుతో బ్రేకప్ వార్తలు వచ్చాయి. ఇలాంటి వార్తలపై మౌనంగా ఉంటేనే డిగ్నిటి పెరుగుతుంది. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాను. అంతకు మించి నా వద్ద జవాబు లేదు అని హన్సిక ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

శింబు బాధపడుతాడు..
శింబుతో అఫైర్ గురించి మాట్లాడితే ఆయన బాధపడుతాడు. నాకు కూడా బాధగా ఉంటుంది. నా జీవితంతో శింబు ముడిపడి ఉన్నందుకు నాకు ఎలా బాధ లేదు. పదేళ్ల తర్వాత కలిసినా గానీ శింబుతో అఫైర్ వివాదం గురించి ఇదే చెబుతాను అని హన్సిక అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

నాకే బ్రేకప్ జరుగుతుందని
హన్సికతో బ్రేకప్‌పై శింబు కూడా స్పందించాడు. ఎంతో మంది నా ఫ్రెండ్స్ బ్రేకప్ జరిగి నా ముందే ఏడ్చాడు. కానీ నాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని నేను ఊహించలేదు. బ్రేకప్‌తో నేను డిప్రెషన్‌కు గురయ్యాను అని శింబు అన్నాడు.

జయం రవితో అఫైర్
మరో తమిళ హీరో జయం రవితో హన్సికకు అఫైర్ ఉంది అనే వార్త బయటకు వచ్చింది. వారిద్దరు కలిసి ఎంగేయమ్ కాదల్, రోమియో జూలియట్ అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో వారి మధ్య అఫైర్ చోటుచేసుకొన్నదని ఆ వార్తల సారాంశం. అయితే హన్సికతో అఫైర్ అంశం జయం రవికి ఫ్యామిలీలో అనే ఇబ్బందులు కలుగజేసింది అని చెప్పుకొంటారు.

సిద్ధార్థ్‌తో ప్రేమలో
తమిళ రంగంలో కెరీర్ ప్రారంభించిన తొలి నాళ్లలో కూడా సిద్ధార్థ్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నదనే వార్తలు వచ్చాయి. కానీ అవి ఎంతో కాలం నిలబడలేదు. ఇలా హన్సిక అఫైర్ల వార్తలతో కెరీర్ ముందుకెళ్తుండగా తాజాగా మరో అఫైర్ వార్త తెరపైకి వచ్చింది.

కుర్ర హీరో అధర్వతో అఫైర్
ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో యువ హీరోగా పేరున్న అధర్వతో ప్రేమలో పడింది అనే మరో వార్త వెలుగులోకి వచ్చింది. వారిద్దరి కలిసి పనిచేసిన దాఖలాలు లేకపోవడం తాజా అఫైర్‌లో ట్విస్ట్. అయితే హన్సిక, అధర్వ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్టు కోలీవుడ్ కోడై కూస్తున్నది. త్వరలోనే హన్సిక, అధర్వ కలిసి నటించేందుకు కోలీవుడ్ నిర్మాత ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











