For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ హన్సికకు చేదు అనుభవం

  By Srikanya
  |

  చెన్నై : రీసెంట్ గా హన్సికకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు సంబంధించిన బ్యాగును గుర్తుతెలియని వ్యక్తులెవరో దొంగతనం చేసారు. అందులో ఐఫోన్‌, ఐపోడ్‌, ఐపాడ్‌లతోపాటు విలువైన మేకప్‌ కిట్‌, కొంత నగదు కూడా ఉంది. హిందీలో వచ్చిన 'ఢిల్లీ బెల్లీ' చిత్రాన్ని ఇప్పుడు దక్షిణాదికి తీసుకొస్తున్నారు. ఆర్య హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే స్విట్జర్లాండ్‌లో చేశారు. అయితే అక్కడే హన్సికకు ఈ అనుభవం ఎదురైంది.

  ఈ విషయమై హన్సిక మాట్లాడుతూ... ''ఓ సీన్ షూటింగ్ కోసం కోసం మేకప్‌ వ్యాను నుంచి బయటకు వచ్చాను. వాహనంలోనే బ్యాగు వదిలిపెట్టాను. షాట్‌ పూర్తయ్యాక వెళ్లి చూసుకొంటే నా బ్యాగు కనిపించలేదు. నా అసెస్టెంట్స్ ని అడిగితే వారు కూడా తెలియదని చెప్పారు. నా వ్యక్తిగత ఫొటోలు, ఈ-మెయిల్స్‌, నేను చేయబోయే సినిమాల తాలూకూ స్క్రిప్టు రెఫరెన్సులు అన్నీ ఆ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్లోనే నిక్షిప్తమై ఉన్నాయి. యూరప్‌ దేశాల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని ఇంతకు ముందు కొందరు హెచ్చరించారు. నేనే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది'' అని వివరించింది. ఆమె నటించిన తెలుగు చిత్రం 'దేనికైనా రెడీ' విడుదల కావల్సి ఉంది.

  మోహన్ బాబు 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై 'దేనికైనా రెడీ' నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రీసెంట్ గా విడుదలైంది. ఇక ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి...వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.

  ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి...వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.

  ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్‌బాబు.

  English summary
  Hansika Motwani's shooting schedule in Switzerland for her Tamil movie Settai, a remake of Delhi Belly, took a horrible turn when she was robbed of some of her personal belongings. The actress was shooting for a song sequence with Arya in Zurich when the incident happened. During a break, Hansika walked to her SUV, which was also being used as a make-up van, and discovered that someone had broke in and robbed her stuff. Among the stolen belongings were her bag, iPhone, iPad, her make-up kit and a few Swiss Francs and US dollars.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X