ఈ సిట్యువేషన్ కి బాధపడుతున్నా...హన్సిక
యువ నటుడు విశాల్‌తో నటించే అవకాశం వచ్చింది కానీ వినియోగించుకోలేక పోతున్నానని హాట్ స్టార్ హన్సిక చెప్పింది.అలాగే తను డేట్స్ ఇవ్వలేని సిట్యువేషన్ లో ఉన్నందకు చింతిస్తున్నానని చెప్పింది. దేశముదురు చిత్రంతో తెలుగు నాట స్టార్ గా ఎదిగిన ఈ అందాల భామ మాప్పిళ్లై చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ధనుష్‌కు జంటగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే జయం రవికి జంటగా ఎంగెందుమ్ కాదల్, విజయ్ సరసన వేలాయుధం చిత్రా ల్లో నటించే అవకాశాలను పొందింది. విశాల్ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ విశాల్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో విక్రమ్‌కృష్ణ నిర్మించనున్న చిత్రంలో హీరోయిన్‌గా నటించాలని తనను కోరినమాట నిజమే అయితే ఆ చిత్రానికి కాల్‌షీట్స్ కేటాయించలేని పరిస్థితి తనదన్నారు. ప్రభుదేవా తనకు ఇష్టమైన దర్శకుడన్నారు. ఈయన దర్శకత్వంలో ప్రస్తుతం ఎంగెందు మ్ కాదల్ చిత్రంలో నటిస్తున్నానని తెలిపింది.


Click it and Unblock the Notifications











