కోటీ పాతికలక్షలు బంపర్ ఆఫర్ మిస్ చేసుకొన్న హాట్ బ్యూటీ...!?
ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులిస్తే పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఐటెం సాంగులు చేసేస్తున్నారు. జస్ట్ మూడు నాలుగు రోజులకు లక్షల్లో పారితోషికం వచ్చిపడిపోతోంది. అందుకే, బాలీవుడ్ హీరోయిన్లు సైతం ఆ బాపతు సాంగుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.
అయితే, తాజాగా హన్సిక మాత్రం ఆ టైపు సాంగుకి 'నో' చెప్పేసింది. పైగా, పెద్ద మొత్తం ఆఫర్ చేసినప్పటికీ ఆమె అటు మొగ్గలేదు. సుశీంద్రన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా, దీక్షాసేథ్, మిత్రా హీరోయిన్స్ గా నటిస్తున్న 'రాజాపట్టై" చిత్రంలోని ఐటెం సాంగు చేస్తే కోటి పాతిక లక్షలు ఇస్తానంటూ తమిళ నిర్మాత హన్సికకు ఆఫర్ ఇచ్చాడట. అయితే, ప్రస్తుతం టాలీవుడ్ లో 'కందిరీగ' సినిమాతో తన కెరీర్ ఓ ట్రాక్ లో పడడంతో ఆమె ఐటెం సాంగుకి అంగీకరించలేదని తెలుస్తోంది. ఒక్కసారి అటువంటి సాంగు అంటూ చేస్తే, మిగతా వాళ్లు కూడా తనకు అదే బ్రాండ్ వేస్తేస్తారని ఆమె భావిస్తోందట. అందుకే, అంత రేటు కళ్ళముందు కనిపించినా, ఆమె టెంప్ట్ అవ్వలేదని అంటున్నారు.
ప్రస్తుతం హన్సిక తమిళంలో విజయ్ సరసన వేలాయిధం చిత్రంలో నటిస్తోంది.వేలాయుధం చిత్రం తెలుగులో గతంలో నాగార్జున చేసిన అజాద్ కు రీమేక్. తమిళనాడులో హీరోయిన్స్ కు గుడులు కట్టడం అనే విచిత్ర సంప్రదాయం ఉంది.గతంలో ఖుష్బూ,నమిత వంటి నటీమణులకు గుడులు కట్టిన అభిమానులు, తమిళనాట అంత క్రేజ్ దక్కించుకొన్న హన్సికకూ ఇప్పుడు గుడి కట్టడానికి సిద్దమవుతున్నారు. మధురై నుంచి వచ్చిన కొందరు ఆమె అభిమానలు ఆమెతో ఈ ప్రపోజల్ పెట్టారు.


Click it and Unblock the Notifications











