ఆ హీరోకి విలన్ గా మారిన హన్సిక
హన్సిక ఇప్పుడు తమిళ హీరో శింబుకు విలన్ గా మారబోతోంది. శింబు తాజా చిత్రం వేట్టయ్ మన్నన్ లో ఆమె నెగిటివ్ పాత్రను చేయబోతోంది. ఆ పాత్ర లేడీ గ్యాంగస్టర్ అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు నెల్సన్. ఈ సినిమా ఇప్పటివరకు తను చేసిన సినిమాలకు ఎలాంటి సంబంధం లేకుండా కొత్తబాటలో సాగుతుందని ఆమె అంటోంది.ఆ పాత్ర ఆమెకు కొత్త కెరిర్ ని ఇస్తుందని భావిస్తోంది. ఇక హన్సిక ని తమిళంలో అక్కడి అభిమానులు జూనియర్ కుష్బూ అంటూ ముద్దుగా చూసుకుంటున్నారు. అయితే తెలుగులో మాత్రం అలా లావుగా ఉండటమే కొంపముందించి. అందరూ కందిరీగలో ఆమె ను చూసి జూనియర్ నమిత అని అన్నారు. ఇక ఆమె ప్రస్తుతం తెలుగులో దిల్‌రాజు నిర్మిస్తున్న 'ఓ మై ఫ్రెండ్' చిత్రంలో నటిస్తోంది. సిద్దార్ద హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా మరో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా తప్ప ఆమెకు తెలుగులో మరో ఆపర్ లేదు.
అయినా తమిళంలో ఆమెకు వరస ఆఫర్స్ రావటంతో ఆమె చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఆమె 'వేలాయుధం' 'ఒకే ఒకే' చిత్రాల్లో నటిస్తోంది. అంతేగాక విజయ్‌తో కలిసి 'వేట్టై మణ్ణన్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని మొత్తం అమెరికా, యూరప్‌లో చిత్రీకరించనున్నారట. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ మీ కెరీర్ ఎలా ఉందని ఆమను మీడియా వారు ప్రశ్నిస్తే... "నేను దేనికీ తొందరపడను. తెలుగులో 'దేశముదురు'లో నటించిన వైశాలి కేరక్టర్ అంటే నాకు ఇష్టం. ఆ చిత్రంతోనే నాకు మంచి పేరు వచ్చింది. అలాగే 'కంత్రి' చిత్రంలోనూ నా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత వచ్చిన కొన్ని సినిమాలు విజయం సాధించలేదు. అయినా నేను నిరుత్సాహ పడలేదు. అవకాశాలకోసం ఎదురు చూశాను. తమిళంలో మంచి చిత్రాల్లో నటించే ఛాన్సులొచ్చాయి. దాంతో మళ్ళీ ఇప్పుడు తెలుగులో కూడా వస్తున్నాయి. 'కందిరీగ' మంచి ఎనర్జీని ఇచ్చింది. దీనిని కంటిన్యూ చేస్తా'' అంది. మరి తమిళంలో నెగిటివ్ పాత్ర హిట్టైతే తెలుగులోనూ ఆ తరహా పాత్రలు వస్తాయేమో చూడాలి.


Click it and Unblock the Notifications











